Bill Gates in Pak: బిల్ గేట్స్‌కు పాకిస్థాన్ పౌర గౌరవం.. ‘హిలాల్ ఎ పాకిస్థాన్’ అవార్డుతో సత్కారం

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను ' హిలాల్ ఎ పాకిస్తాన్' అవార్డుగా పాకిస్థాన్ గురువారం ప్రకటించింది.

Bill Gates in Pak: బిల్ గేట్స్‌కు పాకిస్థాన్ పౌర గౌరవం.. 'హిలాల్ ఎ పాకిస్థాన్' అవార్డుతో సత్కారం
Bill Grates Imran Khan
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 18, 2022 | 4:54 PM

Civil award Hilal-i-Pakistan: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌(Bill Gates)ను ‘ హిలాల్ ఎ పాకిస్తాన్’ (Hilal-i-Pakistan) అవార్డుగా పాకిస్థాన్ గురువారం ప్రకటించింది. పేదరిక నిర్మూలనకు, ఆరోగ్య సంరక్షణ కోసం ఒక రోజు పర్యటనలో ఉన్న బిల్ గేట్స్‌కు పాకిస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ(Arif Alvi) ఈ అవార్డును ప్రదానం చేశారు. సమాచారం ప్రకారం, ఈ రోజు ఇస్లామాబాద్‌లోని ఐవాన్ ఎ సదర్‌లో ప్రత్యేక అలంకరణ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు, పాకిస్థాన్ ప్రభుత్వ దౌత్య సభ్యులు పాల్గొన్నారు.

బిల్ గేట్స్ స్వచ్ఛంద సంస్థ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, పాకిస్తాన్‌లో పోలియో నిర్మూలనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని, అలాగే వివిధ మార్గాల ద్వారా ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. 2010లో బిల్ అండ్ మెలిండా ఫౌండేషన్ గ్లోబల్ హెల్త్ కమ్యూనిటీ సవాలును పరిష్కరించడానికి టీకాల దశాబ్దంగా ప్రకటించింది. ఇందులో ప్రపంచంలోని అత్యంత పేద దేశాలకు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం, పంపిణీ చేయడం వంటివి ఉంటాయి. అతను రాబోయే 10 సంవత్సరాలలో పరిశోధనకు సహాయం చేయడానికి 10 బిలియన్ డాలర్లకు హామీ ఇచ్చారు బిల్ గేట్స్.

బిలియనీర్ పరోపకారి బిల్ గేట్స్ పాకిస్తాన్‌లో ఒక రోజు పర్యటించారు. గురువారం ఆయన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, పాకిస్తాన్‌లో కరోనావైరస్, పోలియోను ఎదుర్కోవటానికి తీసుకుంటున్న చర్యలతో సహా, ఇద్దరి మధ్య అనేక ఇతర అంశాలు చర్చలు జరిపారు. ఈ పర్యటనలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా బిల్ గేట్స్ గౌరవార్థం లంచ్ ఏర్పాటు చేశారు. కరోనాలో ప్రస్తుత పరిస్థితిపై గేట్స్ కూడా అభిప్రాయాలను పంచుకున్నారని ప్రభుత్వ ఆధ్వర్యంలోని రేడియో పాకిస్తాన్ వెల్లడించింది.

పాకిస్థాన్‌కు చెందిన ప్రీమియర్ యాంటీ కరోనావైరస్ సంస్థ నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (NCOC) సెషన్‌కు కూడా గేట్స్ హాజరయ్యారు. ఇక్కడ ఆయన ప్రణాళికా మంత్రి,NCOC చీఫ్ అసద్ ఉమర్‌తో కూడా భేటీ అయ్యారు. NCOC పని గురించి, దేశంలోని కరోనావైరస్ పరిస్థితి, నాన్ ఫార్మాస్యూటికల్ సంస్థల ద్వారా కరోనా మహమ్మారిని నియంత్రించే ప్రయత్నాల గురించి బిల్ గ్రేట్స్ ఆరా తీశారు. దీనితో పాటు, పాకిస్తాన్‌లో గుర్తించిన జీనోమ్ సీక్వెన్సింగ్, కరోనావైరస్ వేరియంట్‌ల గురించి కూడా క్NCOC నిర్వహకులు బిల్ గ్రేట్స్‌కు సమాచారం అందించడం జరిగింది.

ఈ సమయంలో, బిల్ గేట్స్ వనరుల కొరత, ప్రజారోగ్య పరిరక్షణ కోసం కార్యక్రమాలు ప్రవేశపెట్టినప్పటికీ కరోనాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సాధించిన విజయాన్ని ప్రశంసించారు. గేట్స్ మహమ్మారి గురించి, టీకా ద్వారా దానిని ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నాల గురించి కూడా తెలుసుకున్నారు. NCOC ప్రారంభించిన వివిధ కార్యక్రమాలపై ఆసక్తి కనబరిచారు. పాకిస్థాన్‌లో కోవిడ్‌పై జరుగుతున్న ప్రయత్నాలను బిల్ గేట్స్ అభినందించారు.

NCOC చీఫ్ అసద్ ఉమర్ తర్వాత NCOC వద్ద గేట్స్‌ను హోస్ట్ చేయడం గురించి ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌లో కోవిడ్‌ను ఎదుర్కోవడానికి చేసిన పని, అందులో నేషనల్ కమాండ్ ఆపరేషన్ సెంటర్ పాత్ర గురించి మేము గేట్స్‌తో సమాచారాన్ని పంచుకున్నామని ఆయన రాశారు. అలాగే ఈ విషయంలో బిల్ గేట్స్ ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ పోలియో వ్యతిరేక కార్యక్రమం గురించి కూడా బిల్ గేట్స్ సమాచారం తెలుసుకున్నారు. దేశంలో పోలియో నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రోగ్రాం హెడ్ షెహజాద్ బేగ్ ఆయనకు వివరించారు. పోలియో తీవ్రమైన సమస్యగా ఉన్న ప్రపంచంలో మిగిలిన రెండు దేశాలలో పాకిస్తాన్ ఒకటి.

ఇదిలావుంటే, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గత కొన్నేళ్లుగా టచ్‌లో ఉన్నారు. ఇద్దరూ ఏప్రిల్ 2021లో టెలిఫోనిక్ సంభాషణ కూడా చేశారు. COVID 19 ప్రతిస్పందన, పోలియో నిర్మూలన, వాతావరణ మార్పుల గురించి చర్చించారు. ఇందుకు సంబంధించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరఫున బిల్ గేట్స్ నిధులు అందిస్తున్నారు. ఇందులో భాగంగా 2017లో ఫౌండేషన్ ఆఫ్రికా ఆసియాలో వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనే రైతులకు సహాయం చేయడానికి 300 మిలియన్ డాలర్లను ప్రతిజ్ఞ చేసింది. అయితే 2020లో ఫౌండేషన్ దాదాపు 300 మిలియన్ డాలర్లను COVID 19 ప్రపంచ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రచారానికి మద్దతు ఇచ్చింది. 1.75 బిలియన్ డాలర్లు కేటాయించింది.

Read Also…. Political Cold War: నిధులు తెచ్చి అభివృద్ధి చేసినా.. సొంత నియోజకవర్గంలో పర్యటించలేని పార్లమెంటు సభ్యులు