US Citizenship: అమెరికా వలసదారులకు గుడ్‌ న్యూస్‌… కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసిన అమెరికా ప్రతినిధుల సభ..

US Citizenship: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రచారంలో పలు హామీలు ఇచ్చిన జో బైడెన్‌ ప్రస్తుతం వాటిని నెరవేర్చే పనిలో పడ్డారు. ముఖ్యంగా అమెరికాలో నివిస్తోన్న విదేశీయులకు మేలు చేసే పనిలో పడ్డారు. ట్రంప్‌ హయంలో తీసుకున్న పలు నిర్ణయాలకు మార్పులు చేస్తూ తాజాగా...

US Citizenship: అమెరికా వలసదారులకు గుడ్‌ న్యూస్‌... కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసిన అమెరికా ప్రతినిధుల సభ..
Us Citizenship
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 20, 2021 | 2:17 AM

US Citizenship: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రచారంలో పలు హామీలు ఇచ్చిన జో బైడెన్‌ ప్రస్తుతం వాటిని నెరవేర్చే పనిలో పడ్డారు. ముఖ్యంగా అమెరికాలో నివిస్తోన్న విదేశీయులకు మేలు చేసే పనిలో పడ్డారు. ట్రంప్‌ హయంలో తీసుకున్న పలు నిర్ణయాలకు మార్పులు చేస్తూ తాజాగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమ దేశానికి వలస వచ్చిన వారికి పౌరసత్వాన్ని అందించే రెండు కీలక బిల్లులకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది. సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వలస వెళ్లి, అక్కడ నివసిస్తున్న వారికి, వారి పిల్లలకు ఈ బిల్లు ద్వారా పౌరసత్వం అందించనున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ కార్మికులు, హెచ్‌1బీ వీసా ద్వారా అమెరికాకు వచ్చిన టెక్‌ నిపుణుల పిల్లలకు అమెరికా పౌరసత్వాన్ని అందించేందుకు ఈ బిల్లులు ఉపయోగపడనున్నాయి. ఇక ఈ బిల్లులకు 228-197 ఓట్ల మెజార్టీతో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాట్లాడుతూ.. దేశ వలస విధానంలో విప్లవాత్మక మార్పులను తెచ్చే దిశగా ఈ నిర్ణయం అత్యంత కీలకమని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ చట్టం ద్వారా ఎక్కువగా లాభపడే వారిలో భారతీయులు ముందు వరుసలో ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో సరైన సర్టిఫికేట్లు లేకుండా 1.1 కోట్ల మంది నివసిస్తుంటే వీరిలో 5 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇక తాజా బిల్లు ఆమోదంతో 21 ఏండ్లు దాటిన హెచ్‌-1బీ వలసదారుల పిల్లలకు పౌరసత్వం లభించడానికి మార్గం సుగమమైంది. ఈ రెండు బిల్లులు చట్టరూపం దాల్చాలంటే సెనేట్‌ ఆమోదాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. సెనేట్‌లో డెమోక్రాట్లకు మెజారిటీ ఉన్నందున ఆమోదం పొందడం లాంచనమే అని తెలుస్తోంది.

Also Read: చరిత్ర సృష్టించిన ఏడేళ్ల హైదరాబాద్ చిన్నారి.. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్నవయస్కుడిగా రికార్డ్.

Tsunami: 2004 సునామీలో కోట్టుకుపోయిన పోలీసు.. 16 ఏళ్ల తరువాత ప్రత్యక్ష్యమయ్యాడు.. ఇప్పుడెలా ఉన్నాడో మీరే చూడండి..

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 414 ట్రాఫిక్‌ ఉల్లంఘనలు.. రూ.48 లక్షలకుపైగా జరిమానా విధించిన ట్రాఫిక్‌ పోలీసులు