AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America: సుడిగుండం అనుకుంటే పొరపాటే.. అసలు విషయం తెలిస్తే షాక్ అవడం పక్కా

ఈ ఫొటో చూస్తే మీకు ఏమనిపిస్తోంది. డ్యామ్(Dam) లో పేద్ద రంధ్రం ఏర్పడి.. నీళ్లంతా అందులోకి వెళ్లిపోతోందని అనిపిస్తోంది కదూ.. మీరు చూస్తున్నది నిజమే. కానీ మీరు అనుకుంటున్నది మాత్రం నిజం కాదు అసలు...

America: సుడిగుండం అనుకుంటే పొరపాటే.. అసలు విషయం తెలిస్తే షాక్ అవడం పక్కా
Whole In Dam
Ganesh Mudavath
|

Updated on: Apr 13, 2022 | 10:25 AM

Share

ఈ ఫొటో చూస్తే మీకు ఏమనిపిస్తోంది. డ్యామ్(Dam) లో పేద్ద రంధ్రం ఏర్పడి.. నీళ్లంతా అందులోకి వెళ్లిపోతోందని అనిపిస్తోంది కదూ.. మీరు చూస్తున్నది నిజమే. కానీ మీరు అనుకుంటున్నది మాత్రం నిజం కాదు అసలు విషయమేంటంటే.. అమెరికా(America) లోని కాలిఫోర్నియాలో మోంటిసెల్లో డ్యామ్‌ ఉంది. దీనిని 1950ల్లో నిర్మించారు. అత్యంత తీవ్రమైన పరిస్థితులు వచ్చినప్పుడు, వర్షాలు విపరీతంగా కురిసినప్పుడు ఈ డ్యామ్‌లో నిండిన నీళ్లు బయటకు వెళ్లేలా ఇంజినీర్లు ఓ భారీ పైపును ఏర్పాటు చేశారు. 22 మీటర్ల వెడల్పు, 75 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ పైపు నుంచి మరో చిన్న పైపు ద్వారా అర కిలోమీటరు దూరంలోని పుటాహ్‌ క్రీక్‌లోకి నీళ్లను తరలించేలా ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలో మీకు కనిపిస్తున్న రంద్రం ఈ పైపుదే. ఈ రంద్రం సెకనుకు దాదాపు 48 వేల క్యూబిక్‌ అడుగుల నీటిని లాగేసుకుంటుంది. ఈ రంధ్రాన్ని స్థానిక ప్రజలు ‘గ్లోరీ హోల్‌’ అని పిలుచుకుంటారు. డ్యామ్‌లో నీటిని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన ఇలాంటి రంధ్రాలను ‘బెల్‌ మౌత్స్‌’(Bell Mouths) అంటుంటారు. ప్రపంచంలోని చాలా డ్యామ్‌లలో ఈ విధానం పాటిస్తున్నారు.

వర్షాలు విపరీతంగా కురవడం, ఈ పైపు నుంచి నీళ్లు బయటకు వెళ్లడం వంటి పరిస్థితులు 50 ఏళ్లకోసారి రావచ్చని దీనిని నిర్మించేటపప్పుడు ఇంజినీర్లు భావించారు. అయితే 2000 సంవత్సరం మొదలయినప్పటినుంచి చాలాసార్లు ఈ హోల్‌లో నుంచి నీళ్లు బయటకు వెళ్లాయి. 2017లో భారీ స్థాయిలో వర్షాలు కురిసినప్పుడు ఈ బెల్‌ మౌత్‌ వార్తల్లో నిలిచింది. చాలా మంది స్థానికులు, పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వచ్చారు. సుడిగుండం లాంటి ఈ రంధ్రం దగ్గరకి మనుషులు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also Read

IPL 2022: ఈ రన్ మెషీన్‌కు ఏమైంది.. 5 ఇన్నింగ్స్‌ల్లో 107 పరుగులు.. కెప్టెన్నీ వదులుకున్నా.. ఫేట్ మారలే..

Eggs Side Effect: గుడ్డు మంచిదని తెగ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..

Beauty Tips: నిద్రలేవగానే ఇలా చేస్తే అందమైన ముఖం మీ సొంతం.. సింపుల్ బ్యూటీ టిప్స్ మీకోసం..