Eggs Side Effect: గుడ్డు మంచిదని తెగ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..

ప్రతిరోజూ గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని అంటారు వైద్యులు. అల్పాహారంలో గుడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

Eggs Side Effect: గుడ్డు మంచిదని తెగ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..
Eggs
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 13, 2022 | 9:29 AM

ప్రతిరోజూ గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని అంటారు వైద్యులు. అల్పాహారంలో గుడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రోజుకీ ఒక గుడ్డు ఉడకబెట్టుకుని తినేవారు ఎక్కువగానే ఉంటారు. అయితే రోజుకీ మూడు, నాలుగు గుడ్లు తినేవారు కూడా ఉంటారు. కానీ.. రోజులో ఎక్కువ గుడ్లు తినడం వలన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది శరీరానికి హని కలుగజేస్తుంది. గుడ్లను పరిమితంగా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది. అయితే గుడ్లు వేడిని పెంచుతాయి. వేసవిలో ఎక్కువగా గుడ్లను తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. కడుపు సంబంధిత సమస్యలు, అజీర్ణం, గ్యాస్, మొటిమల సమస్యలు ఉన్నవారు గుడ్లను తీసుకోవడం వలన ఆ సమస్యలు మరింత పెరుగుతాయి. శరీరంలో వేడి పెరగడం వలన డయేరియా రావచ్చు. గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకుందామా.

గుడ్లలో అత్యధిక మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. ఇవి కళ్ళు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి సహయపడతాయి. ఇందులో భాస్వరం, ఐరన్, విటమిన్ ఎ, బి6, బి12, సెలీనియం, జింక్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, కొలెస్ట్రాల్, మెగ్నీషియం, ఫోలేట్, సోడియం మొదలైనవి ఉంటాయి.

ఎక్కువ గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు.. * మెడిసర్కిల్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం గుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది చికెన్ నుండి వస్తుంది. గుడ్లను సరిగ్గా ఉడకబెట్టకపోతే ఈ బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. * సరిగ్గా ఉడికించిన గుడ్లను తినకపోతే ఉబ్బరం, వాంతులు, అజీర్ణం, కడుపు నొప్పి, మంట, తిమ్మిరి వంటి కడుపు సంబంధిత సమస్యల వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది. * దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై అనేక ఇతర దుష్ప్రభావాలూ ఉంటాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీపై ప్రతికూల ప్రభావం పడుతుంది. * కొందరికి గుడ్లంటే అలర్జీ ఉంటుంది కాబట్టి గుడ్లు తీసుకోవద్దు. పరిమిత పరిమాణంలో గుడ్లు తీసుకుంటే, ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. * రోజూ 1-2 గుడ్లు తినడం వల్ల ఎటువంటి హాని ఉండదు. కానీ వేసవిలో ఒక గుడ్డు మాత్రమే తినడానికి ప్రయత్నించండి. మీరు గుడ్లతో ఏమి తింటున్నారో ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. * కోడిగుడ్లలో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు రోజూ తినకూడదు. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. * కండరాలు బలంగా ఉంటాయి * మెదడు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తాయి * భౌతిక శక్తి ఏర్పడుతుంది * రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది * గుండెను ఆరోగ్యంగా ఉంచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది * గర్భధారణ సమయంలో గుడ్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి * కంటి చూపును మెరుగుపరుస్తుంది, మచ్చల క్షీణతను నివారిస్తుంది * బరువు తగ్గించడంలో సహాయపడుతుంది * చర్మ వ్యాధుల నుండి రక్షిస్తుంది. చర్మం ఆరోగ్యంగా, దీర్ఘకాలం యవ్వనంగా ఉంచుతుంది.

గమనిక:- ఈ సమాచారం కేవలం నిపుణుల సూచనలు, ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవికరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యుల సలహాలు తీసుకోండి.

Also Read: Sanjay Dutt: ఆలియా, రణబీర్ కపూర్ పిల్లల కోసం చూస్తున్నాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన సంజయ్ దత్..

Anil Ravipudi: సరికొత్త లుక్‏లో బాలకృష్ణను చూపించబోతున్నాను.. ఆసక్తికర విషయాలను చెప్పిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..

Prashanth Neel : సలార్ సిక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. గట్టిగా చెప్పేస్తానంటూ..

Hair Care Tips: జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా..? ఉసిరితో శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..