Hair Care Tips: జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా..? ఉసిరితో శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..
ఉసిరికాయతో (Amla) ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జుట్టు సమస్యలను తగ్గించడంలోనూ
ఉసిరికాయతో (Amla) ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జుట్టు సమస్యలను తగ్గించడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఉదయం ఉసిరి రసాన్ని మీ తలకు పట్టిస్తే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. ఇందులో చాలా ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటాయి. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది మీకు బలమైన.. ఒత్తైన జుట్టును అందిస్తుంది. ఉసిరితో జుట్టుకు కలిగే ప్రయోజనాల గురించి తెలుకుందామా. ఉసిరి పేస్ట్ ను జుట్టుకు పట్టించినప్పుడు ఇందులోని విటమిన్లు, ఖనిజాలు రక్తప్రసరణను పెంచుతాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఉసిరి పొడి, గుడ్డు తెల్లసొన మిశ్రమాన్ని జుట్టుకు పట్టించడం వలన ప్రయోజనం ఉంటుంది.
ఉసిరిలో టానిన్, కాల్షియం ఉన్నాయి. ఇది మీ జుట్టుకు ఫోటో-డ్యామేజ్, హీట్ డ్యామేజ్ నుండి కూడా సహాయపడుతుంది. టానిన్, ఫినాలిక్ సమ్మేళనాలు జుట్టు కెరాటిన్ ప్రోటీన్‌లను అందిస్తాయి. ఇది జుట్టు చిట్లీపోవడం వంటి సమస్యను తగ్గిస్తుంది. ఉసిరికాయను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడాన్ని కూడా తగ్గించవచ్చు. అలాగే జుట్టు పెరుగుదలను పెంచుతుంది. ఉసిరి నూనె 5-ఆల్ఫా రిడక్టేజ్ శక్తివంతమైన నిరోధకం. ఇది పురుషులు, స్త్రీల బట్టతల చికిత్సకు ఉపయోగిస్తారు. జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్లకు ఉసిరి కాయ ప్రధానం. ఉసిరిలోని విటమిన్ సి కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు సమస్యలను తగ్గించి బలంగా తయారు చేస్తాయి. విటమిన్ సి స్కాల్ప్‌ను క్లియర్ చేయడంలో రసాయనికంగా పేరుకుపోయిన, ధూళి, ధూళి పొరలను తొలగించడంలో సహాయపడుతుంది. స్కాల్ప్ శుభ్రమైన తర్వాత అది పోషకమైన జుట్టు ఉత్పత్తులను పెంచుతుంది. ఉసిరి నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు గొప్ప కండీషనర్‌గా చేస్తుంది. ఇది మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. పొడిగా మారిన జుట్టు సమస్యను తగ్గించడంలో ఆమ్లా ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది.
Also Read: Beast VS KGF Chapter 2 : తెలుగు రాష్ట్రాల్లో ఆ టార్గెట్ పై కన్నేసిన బడా మూవీస్..
Trivikram Srinivas: ఓ వైపు సూపర్ స్టార్.. మరో వైపు పవర్ స్టార్.. గురూజీ మాస్టర్ ప్లాన్
Ravi Teja: జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న మాస్ మాహారాజా.. హైవోల్టేజ్ యాక్షన్ మోడ్‌లో రవితేజ