Telugu News » Photo gallery » Beauty Tips: Follow this morning skin care routine in summer for beauty benefits in Telugu
Beauty Tips: నిద్రలేవగానే ఇలా చేస్తే అందమైన ముఖం మీ సొంతం.. సింపుల్ బ్యూటీ టిప్స్ మీకోసం..
Summer Skin Care: శీతాకాలం అయినా ఎండాకాలం అయినా ప్రతి సీజన్ లో చర్మ సంరక్షణ చేయడం ముఖ్యం. వేసవిలో ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ రోజంతా ముఖం తాజాగా ఉంటుంది. ఉదయం చర్మ సంరక్షణ దినచర్యకు సంబంధించిన చిట్కాలను ఇప్పడు తెలుసుకోండి.
ఫేస్ క్లీన్: వేసవిలో ముఖంపై ఆయిల్ మొటిమలు, మచ్చలు వస్తాయి. బెడ్‌షీట్‌పై ఉన్న దుమ్ము రాత్రిపూట ముఖంపై చేరుతుంది. ఉదయం మొహం శుభ్రం చేసుకోవడం మంచిది. అందుకే ఉదయాన్నే ఫేస్ వాష్ లేదా క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.
1 / 5
సన్‌స్క్రీన్: వేసవి లేదా శీతాకాలం అయినా ఏడాది పొడవునా సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. వేసవిలో చాలా మంది ప్రజలు ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ను అప్లై చేస్తారు. అయితే సీజన్‌లో ఉండే వేడి కూడా చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం మంచిది.
2 / 5
టోనర్: ఉదయం నిద్రలేచిన తర్వాత చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి టోనర్‌ను ఉపయోగించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. దీని కోసం మీరు ఎల్లప్పుడూ ఆల్కహాల్ ఫ్రీ టోనర్‌ని ఉపయోగించాలి.
3 / 5
మాయిశ్చరైజర్: వేసవిలో చర్మంపై తేమ తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో కూడా మాయిశ్చరైజర్ ఉపయోగించడం అవసరం. ముఖ్యంగా వేసవిలో మీ బ్యూటీ కేర్ రొటీన్‌లో జెల్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఒక భాగంగా చేసుకోవడం మంచిది.
4 / 5
హెవీ మేకప్ చేయకండి: చాలా సార్లు మహిళలు వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎక్కడికైనా వెళ్లేముందు హెవీ మేకప్ చేసుకుంటారు. వేసవిలో చేసే భారీ మేకప్, చెమట లేదా ఇతర కారణాల వల్ల కూడా మొహం నిర్జీవంగా మారుతుంది. అందుకే తేలికపాటి మేకప్ మాత్రమే చేసుకోవాలి.