- Telugu News Photo Gallery Hair Care Tips Apply these vitamin C foods in hair for shine and healthy hair
Hair Care Tips: వేసవిలో అందమైన, మెరిసే జుట్టు కావాలా?.. అయితే, ఈ చిట్కాలను పాటించండి..!
నిమ్మకాయ: ఇది విటమిన్ సి ఉత్తమ మూలంగా పరిగణించబడుతుంది. దీనికి సంబంధించిన చిట్కాలను అనుసరించడం ద్వారా నిగనిగలాడే, ఆరోగ్యవంతమైన జుట్టు సొంతం అవుతుంది.
Updated on: Apr 13, 2022 | 7:03 AM

నిమ్మకాయ: ఇది విటమిన్ సి ఉత్తమ మూలంగా పరిగణించబడుతుంది. దీనికి సంబంధించిన చిట్కాలను అనుసరించడం ద్వారా నిగనిగలాడే, ఆరోగ్యవంతమైన జుట్టు సొంతం అవుతుంది. చుండ్రు సమస్యను కూడా తొలగిస్తుంది. నిజానికి నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ స్కాల్ప్ ను ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. జుట్టు మెరుపు పెరగాలంటే నిమ్మరసాన్ని వారానికి రెండు సార్లు జుట్టుకు అప్లై చేయాలి.

పెరుగు: జుట్టు ఆరోగ్యంగా, మెరిసేలా చేయడానికి పెరుగును ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. విటమిన్ సితో పాటు, పెరుగులో చాలా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. ఇవి జుట్టు మెరుపును పెంచడంలో సహాయపడతాయి. మీరు జుట్టుకు పెరుగు మాస్క్‌ను అప్లై చేయవచ్చు.

అవకాడో: ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ రెసిపీని స్వీకరించడానికి, ఒక గిన్నెలో రెండు చెంచాల తేనె తీసుకోండి. అందులో గుజ్జు అవకాడో వేసి జుట్టుకు పట్టించాలి. సుమారు 30 నిమిషాల తర్వాత, చల్లని నీటితో జుట్టు కడగాలి.

ఆరెంజ్ తొక్క: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చుండ్రు జుట్టు రాలిపోవడం, షైన్ కోల్పోయేందుకు కారణం అవుతుంది. చుండ్రును తొలగించడానికి నారింజ తొక్క సహాయం తీసుకోవచ్చు. నారింజ తొక్కలను నీటిలో వేసి మరిగించి ఒక రోజు ఇలాగే ఉంచండి. మరుసటి రోజు దీన్ని ఫిల్టర్ చేసి హెయిర్ రిన్స్‌గా జుట్టుకు పట్టించాలి.

ఉసిరి: ఉసిరి నీటిని హెయిర్ సీరమ్‌గా ఉపయోగించవచ్చు. విటమిన్ సి కలిగి ఉన్న ఉసిరి జుట్టును లోపలి నుండి రిపేర్ చేస్తుంది. జుట్టు మెరిసేలా, ఆరోగ్యంగా చేస్తుంది. ఉసిరి నీటిని తీసుకుని రాత్రంతా తలకు పట్టించాలి. ఉదయం షాంపూ, కండీషనర్ తో క్లీన్ చేసుకోవాలి.




