Anil Ravipudi: సరికొత్త లుక్‏లో బాలకృష్ణను చూపించబోతున్నాను.. ఆసక్తికర విషయాలను చెప్పిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..

అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna). మాస్ డైరెక్టర్ బోయాపాటి శ్రీను

Anil Ravipudi: సరికొత్త లుక్‏లో బాలకృష్ణను చూపించబోతున్నాను.. ఆసక్తికర విషయాలను చెప్పిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..
Anil Ravipudi
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 13, 2022 | 6:56 AM

అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna). మాస్ డైరెక్టర్ బోయాపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం బాలయ్య.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీని పూజా కార్యాక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో రాబోతున్న ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అఖండ సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసిన బాలయ్య తర్వాత చేయబోయే సినిమాపై భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి .

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. బాలకృష్ణ గారిని ఎలా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతారో.. అలా చూపించాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. నా మార్కు వినోదాన్ని ఎలాగో అలా ఈ సినిమాలోనూ యాడ్ చేస్తాను. కానీ.. ఇంతకు ముందు నా సినిమాల మాదిరిగా ఎక్కువ కామెడీని మాత్రం చేయలేము. బాలకృష్ణ స్ట్రైంత్ ఏమిటో పట్టుకుని.. ఆయన ఇమేజ్ కి భిన్నంగా వెళ్లకుండా.. ఒక డిఫరెంట్ జోనర్లో ఈ కథను నడిపించాలని అనుకుంటున్నాను. బాలకృష్ణ పాత్రను కొత్తగా ఎలా డిజైన్ చేయాలి.. ఆయన లుక్.. మాట.. డైలాగ్స్.. బాడీ లాంగ్వేజ్ పై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాను. ఇది వర్కౌట్ అయితే తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా.. తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఈ మూవీ పై క్యూరియాసిటీని పెంచేశాయి.

Also Read: Beast VS KGF Chapter 2 : తెలుగు రాష్ట్రాల్లో ఆ టార్గెట్ పై కన్నేసిన బడా మూవీస్..

Trivikram Srinivas: ఓ వైపు సూపర్ స్టార్.. మరో వైపు పవర్ స్టార్.. గురూజీ మాస్టర్ ప్లాన్

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. ‘సర్కారు వారి పాట’ లేటెస్ట్ అప్డేట్

Ravi Teja: జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న మాస్ మాహారాజా.. హైవోల్టేజ్ యాక్షన్ మోడ్‌లో రవితేజ