Sanjay Dutt: ఆలియా, రణబీర్ కపూర్ పిల్లల కోసం చూస్తున్నాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన సంజయ్ దత్..

బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్ (Alia Bhatt), రణబీర్ కపూర్ (Ranbir Kapoor) పెళ్లి గురించి నెట్టింట్లో వార్తాలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

Sanjay Dutt: ఆలియా, రణబీర్ కపూర్ పిల్లల కోసం చూస్తున్నాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన సంజయ్ దత్..
Sanjay Dutt
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 13, 2022 | 7:44 AM

బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్ (Alia Bhatt), రణబీర్ కపూర్ (Ranbir Kapoor) పెళ్లి గురించి నెట్టింట్లో వార్తాలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముందుగా వీరిద్దరూ పెళ్లి ఏప్రిల్ 14న పెళ్లి చేసుకుంటున్నట్లు టాక్ వినిపించింది. ఆ తర్వాత వీరిద్దరి పెళ్లి ఏప్రిల్ 20కి వాయిదా పడినట్టుగా టాక్ నడుస్తోంది. ఇప్పటికే వివాహ వేడుకకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. అయితే వీరి పెళ్లి గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే వీరి పెళ్లి జరగనుంది. తాజాగా వీరిద్దరి పెళ్లి పై బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ స్పందించాడు. వారిద్దరూ పెళ్లి చేసుకోవడం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ దత్ ఆలియా, రణబీర్ కపూర్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు.

సంజయ్ దత్ మాట్లాడుతూ.. రణబీర్ పెళ్లి చేసుకుంటే ఎక్కువగా సంతోషించేది నేను. రణబీర్ తొందరగా పెళ్లి చేసుకో.. పిల్లలను తొందరంగా కనివ్వండి. ఆలియా నా ముందే పుట్టి పెరిగింది. పెళ్లి అనేది ఒకరికొకరు చేస్తున్న నిబద్ధత. దానికి కట్టుబడి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఆనందంగా ముందుకు సాగాలి. వారికి ఎప్పుడూ శాంతి, కీర్తి ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న కేజీఎఫ్ 2 చిత్రంలో కీలకపాత్రలో సంజయ్ దత్ నటించాడు.

Also Read: Beast VS KGF Chapter 2 : తెలుగు రాష్ట్రాల్లో ఆ టార్గెట్ పై కన్నేసిన బడా మూవీస్..

Trivikram Srinivas: ఓ వైపు సూపర్ స్టార్.. మరో వైపు పవర్ స్టార్.. గురూజీ మాస్టర్ ప్లాన్

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. ‘సర్కారు వారి పాట’ లేటెస్ట్ అప్డేట్

Ravi Teja: జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న మాస్ మాహారాజా.. హైవోల్టేజ్ యాక్షన్ మోడ్‌లో రవితేజ