Weight Loss: ఊబకాయంతో బాధపడుతున్నారా..? ఈ టిప్స్ ఫాలో అయితే లావు తగ్గడంతోపాటు మరెన్నో ప్రయోజనాలు..

How to Reduce Bloating: ప్రస్తుత కాలంలో చాలా మంది యువకులు ఊబకాయం, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఉబ్బరం వల్ల మీ శరీరం వదులుగా

Weight Loss: ఊబకాయంతో బాధపడుతున్నారా..? ఈ టిప్స్ ఫాలో అయితే లావు తగ్గడంతోపాటు మరెన్నో ప్రయోజనాలు..
Weight Loss
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 13, 2022 | 9:50 AM

How to Reduce Bloating: ప్రస్తుత కాలంలో చాలా మంది యువకులు ఊబకాయం, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఉబ్బరం వల్ల మీ శరీరం వదులుగా కనిపించడమే కాకుండా మీ లుక్స్‌తో పాటు చర్మం మెరుపుపై​కూడా ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఉబ్బరం, లావుగా కనిపించడం, వదులుగా ఉండే చర్మం సమస్యను నివారించడంలో మీకు చాలా సహాయపడతాయి. విశేషమేమిటంటే ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఆ చిట్కాలు ఏమిటీ..? శరీరంపై ఎలా ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సులభమైన – ప్రభావవంతమైన చిట్కాలు

చక్కెర కోరికలను నియంత్రించండి: స్వీట్లకు, చక్కెరకు దూరంగా ఉండండి. ముఖ్యంగా దీనికి సులభమైన మార్గం ఏమిటంటే మీరు రాత్రిపూట కనీసం 7:30 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. తక్కువ నిద్రపోవడం కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

నీరు బాగా తాగాలి: ప్రతిరోజూ 2.5 నుంచి మూడు లీటర్ల నీరు తాగడం ద్వారా మీరు మీ చర్మాన్ని 10 సంవత్సరాల వరకు యవ్వనంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే మన శరీరంలో 70 శాతం వరకు నీటితోనే నిర్మితమై ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో నీరు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు చర్మ ఆరోగ్యానికి, గ్లోకి టానిక్‌గా పనిచేస్తుంది.

జీవనశైలి: ఉదయం నిద్ర లేవడానికి, రాత్రి నిద్రపోయే సమయాన్ని నిర్ణయించుకోవాలి. దీనితో పాటు ఆహారం తినే సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ జీవక్రియ సరిగ్గా ఉంటుంది. దీని ప్రభావం మీ శక్తి స్థాయి, చర్మం మెరుపుపై కనిపిస్తుంది.

వీటివల్ల కలిగే ప్రయోజనాలు..

తగినంత నిద్ర పోతే.. మీ శరీరం మరుసటి రోజు ఎక్కువ చక్కెరను డిమాండ్ చేయదు. ఎందుకంటే శరీరానికి సహజ శక్తి ఉంటుంది. శక్తి కోసం స్వీట్ల మద్దతు అవసరం ఉండదు. దీనితో పాటు శరీర కండరాలు విశ్రాంతిగా ఉంటాయి. కడుపు ఉబ్బరం కూడా కలిగించదు.

శరీరానికి సరైన మొత్తంలో నీరు అందినప్పుడు లోపల ఉన్న అన్ని విషపూరిత టాక్సిన్స్ మూత్రం, చెమట ద్వారా బయటకు వస్తాయి. దీని వల్ల మొటిమలు, మచ్చలు దూరమవుతాయి. దీంతో చర్మం చాలా బిగుతుగా మెరుస్తూ ఉంటుంది.

జీవ గడియారాన్ని సెట్ చేసినప్పుడు.. జీర్ణవ్యవస్థ, మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉంటాయి. దీంతో మరింత ఉత్సాహంగా.. సంతోషంగా ఉంటారు. ఇది శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. దీని ప్రభావం శరీరంపై స్పష్టంగా కనిపిస్తుంది.

గమనిక:- ఈ సమాచారం కేవలం నిపుణుల సూచనలు, ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవికరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యుల సలహాలు తీసుకోండి.

Also Read:

Eggs Side Effect: గుడ్డు మంచిదని తెగ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..

Pranahita Pushkaralu: ఇవాళ్టి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు.. మధ్యాహ్నం తర్వాత నదిలోకి పుష్కర పురుషుడు..