IPL 2022: ఈ రన్ మెషీన్‌కు ఏమైంది.. 5 ఇన్నింగ్స్‌ల్లో 107 పరుగులు.. కెప్టెన్నీ వదులుకున్నా.. ఫేట్ మారలే..

కేవలం మూడు బంతులు ఎదుర్కొన్న మాజీ ఆర్‌సీబీ సారథి.. ఒక్క పరుగు మాత్రమే చేసి, తీవ్రంగా నిరాశపరిచాడు. ముఖేష్ చౌదరి విసిరిన బంతిని భారీ షాట్ ఆడాలనుకున్నాడు. కానీ

IPL 2022: ఈ రన్ మెషీన్‌కు ఏమైంది.. 5 ఇన్నింగ్స్‌ల్లో 107 పరుగులు.. కెప్టెన్నీ వదులుకున్నా.. ఫేట్ మారలే..
Ipl 2022 Royal Challengers Bangalore Former Captain Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Apr 13, 2022 | 10:08 AM

ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 23 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)ను ఓడించింది. RCB 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి, 9 వికెట్లకు 193 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆఖరి ఓవర్‌లో షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ బ్యాట్‌తో చేసిన పరుగులు చూస్తుంటే.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కాస్త పరుగులు చేసి ఉంటే ఈ మ్యాచ్‌లో RCB సునాయాసంగా గెలిచి ఉండేదేమో అనిపించింది. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో బెంగళూర్‌కి మొదటి దెబ్బ త్వరగానే తగిలింది. జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కేవలం 8 పరుగులకే ఔటయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ మైదానంలోకి వస్తే కింగ్ కోహ్లి పాత ఫామ్ కనిపిస్తుందని అంతా అనుకున్నారు. భారీ లక్ష్యాన్ని సులువుగా ఛేదించడంలో ప్రత్యేకత ఉన్న కోహ్లి.. మరోసారి అలాంటి మాయ చేస్తాడని అంతా ఊహించారు.

కేవలం మూడు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి, తీవ్రంగా నిరాశపరిచాడు. ముఖేష్ చౌదరి విసిరిన బంతిని భారీ షాట్ ఆడాలనుకున్నాడు. కానీ, శివమ్ దూబే, డీప్ స్క్వేర్ లెగ్ వద్ద నిలబడి అద్భుతంగా తీసుకోవడంతో కోహ్లీ పెవిలియన్ చేరాడు. ఆర్‌సీబీ ఓటమికి విరాట్ కోహ్లిదే పెద్ద బాధ్యత అంటూ పలువురు మాట్లాడుతున్నారు. జట్టుకు కోహ్లీ అవసరమైనప్పుడు, అతని బ్యాట్ నుంచి ఒక పరుగు మాత్రమే వచ్చింది.

మునుపటిలా ఫైర్ లేదు.. 5 మ్యాచ్‌ల్లో ఫిఫ్టీ లేదు..

RCB మాజీ కెప్టెన్ IPLలో 5 సెంచరీలు చేశాడు. గత సీజన్ నుంచి కోహ్లీ ఫామ్‌లో లేడు. ఈ ఏడాది విరాట్ 5 మ్యాచ్‌లు ఆడి 107 పరుగులు చేశాడు. అతను ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. గత సీజన్‌లోనూ కోహ్లీ రికార్డు చాలా పేలవంగా ఉంది. 15 మ్యాచ్‌లు ఆడి, కేవలం 119.46 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. అదే సమయంలో, 2020 సీజన్‌లో అతని స్ట్రైక్ రేట్ 121.35గా నిలిచింది.

ఈ సీజన్‌లో కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత మళ్లీ తన పాత ఫాంలోకి వస్తాడని అనిపించింది. కానీ, ఇప్పటివరకు అది జరిగేలా కనిపించడం లేదు. ఆర్‌సీబీ తొలిసారి ఐపీఎల్‌లో ఛాంపియన్‌గా నిలవాలంటే, కోహ్లీ త్వరగా ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ కోరకుంటున్నారు.

Also Read: 4 ఇన్నింగ్స్‌లు.. 2 అర్ధ శతకాలు.. 175 పరుగులు.. జీరోగా మారుతోన్న రూ. 15 కోట్ల ముంబై ప్లేయర్!

CSK Vs RCB IPL 2022: దూబే, ఉతప్పల బీస్ట్ మోడ్.. దెబ్బకు రికార్డుల గల్లంతు.. ఐపీఎల్‌లో ఇదొక అద్భుతం..