US President Biden: అమెరికా అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. గన్ కల్చర్‌పై ప్రత్యేక ఫోకస్..
US President Biden: అగ్రరాజ్యం అమెరికాలో పెరిగిపోతున్న గన్‌కల్చర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా నియంత్రణ చర్యలకు ఉపక్రమించారు అధ్యక్షుడు జోబైడెన్.
US President Biden: అగ్రరాజ్యం అమెరికాలో పెరిగిపోతున్న గన్‌కల్చర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా నియంత్రణ చర్యలకు ఉపక్రమించారు అధ్యక్షుడు జోబైడెన్. పెరిగిపోతుకున్న ఘోస్ట్ గన్ నేరాలకు అడ్డుకట్టవేస్తామని ప్రకటించారు. అమెరికాలో తుపాకీ కొనడం అంటే చాక్లెట్ కొన్నంత ఈజీ.. సూపర్ మార్కెట్‌లో, షాపుల్లో సరుకులు అమ్మినట్లే రకరకాల గన్స్ అమ్ముతుంటారు. అక్కడ ఎవరి చేతిలో అయినా గన్ ఉండవచ్చు. ఈ విచ్చల విడి గన్ కల్చర్ కారణంగానే అమెరికాలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయనేది వాస్తవం. చిన్న పిల్లల చేతికి కూడా తుపాకులు అందుబాటులో ఉండటతో ఇటీవల ఓ విద్యార్థి పాఠశాలలో కాల్పులు జరిపి తోటి విద్యార్థుల ప్రాణాలు తీశాడు. ఈ తుపాకుల్లో ఘోస్ట్ గన్‌లు మరోరకం. వీటికి సీరియల్ నెంబర్స్ కూడా ఉండకపోవడంతో గుర్తించడం కష్టం. అత్యధిక నేరాలు జరిగేది వీటితోనే. గత ఏడాది అమెరికా వ్యాప్తంగా 20 వేల గన్‌ఫైర్స్ జరిగాయని అంఛనా. ఈ ఘటనల్లో 20 వేల 726 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో పెరిగిపోతున్న గన్‌కల్చర్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఫెడరల్ ప్రభుత్వం ప్రయత్నించినా, వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న చట్టాలు సంక్షిష్టంగా ఉంటడంతో చిక్కులు ఏర్పడ్డాయి. తాజాగా తుపాకులపై నియంత్రణ చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్. గన్ కల్చర్‌తో పెరిగిపోతున్న హత్యలు, హింసాత్మక నేరాలకు బ్రేక్ వేసే దిశగా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇకపై సీరియల్ నెంబర్ లేకుండా గన్స్ తయారు చేయడం, లైసెన్స్‌డ్ డీలర్స్ వీటిని తనిఖీ చేయకుండా విక్రయించడం చట్ట విరుద్దమని స్పష్టం చేశారు బైడెన్. అమెరికాలో గన్‌కల్చర్‌ను అదుపు చేసేందుకు చర్యలు చేపడతామని గత ఏడాది ఏప్రిల్‌లోనే కార్యాచరణ ప్రకటించారు జోబైడెన్. ఇందుకు అనుగుణంగానే తాజా నిబంధనలు రూపొందించామని తెలిపారు.
Also read:
Turmeric Effects: దుస్తులపై పసుపు మరకలను పోవడం లేదా?.. అయితే, టిప్స్ ఫాలో అవండి..!
Viral Video: అయ్యయ్యో.. బిస్కెట్ అయిన యువతి ఫీట్.. ఫుల్లుగా నవ్వుకుంటున్న నెటిజన్లు..!