Dust Storm: ఇరాక్‌ను కుదిపేస్తున్న డస్ట్ స్ట్రోమ్.. అస్తవ్యస్తంగా జనజీవనం..
Dust Storm in Iraq: ఇరాక్‌లో ధూళి తుఫాన్ బీభత్సం సృష్టించింది. రాజధాని బాగ్దాద్ సహా పలు పట్టణాల్లో ధుమ్ము, ధూళితో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండిపోయారు.
Dust Storm in Iraq: ఇరాక్‌లో ధూళి తుఫాన్ బీభత్సం సృష్టించింది. రాజధాని బాగ్దాద్ సహా పలు పట్టణాల్లో ధుమ్ము, ధూళితో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండిపోయారు. ఇరాక్ రాజధాని బాగ్ధాద్ (Baghdad) సహా అనేక ప్రాంతాలను డస్ట్ స్ట్రోమ్ కుదిపేసింది. గత నాలుగైదు రోజులుగా ధూళి తుఫాన్‌తో ఇరాకీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణం వైపు నుంచి పెనుగాలులు వీచాయి. రోడ్డుపై ఉన్న దుమ్ము, చెత్తా చెదారం గాల్లో కలిసిపోయింది. కొన్నిచోట్ల టోర్నోడోలు సైతం బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. రహదారులపై వెళ్తున్న జనం కళ్లలో దుమ్ముపడింది. దాంతో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అనేకమంది కార్లలోనే తమ జర్నీ కొనసాగిస్తున్నారు.
డస్ట్‌స్ట్రోమ్ ధాటికి వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్‌కి సెలవు ఇచ్చేశారు. ఆకాశమంతా నారింజ, ఎర్రని రంగుతో కమ్మేసింది. పలు ఇళ్లు, కార్యాలయాలు దుమ్ముతో నిండిపోయాయి. తుఫాన్ ధాటికి బాగ్ధాద్ నుండి వెళ్లే విమానాలను రద్దు చేశారు అధికారులు. ఎవ్వరూ కూడా బయటకు రావొద్దని హెచ్చరించారు. ధూళి తుఫాన్ తగ్గేందుకు మరిన్ని రోజులు పట్టవచ్చని ఇరాక్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
ప్రతియేటా ఏప్రిల్-మే నెలలో ఇరాక్ దక్షిణం వైపు నుంచి వచ్చే ధూళి తుఫాన్ భయంకరమైందని స్థానిక అధికారులు తెలిపారు. దక్షిణం వైపు నుంచి ప్రారంభమై నసిరియా వరకూ విస్తరించాయన్నారు. మరోవైపు ధూళి తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..
Russia – Ukraine War: ‘అమ్మా స్వర్గంలో కలుస్తా!’.. రష్యా దాడిలో చనిపోయిన తల్లికి 9 ఏళ్ల బాలిక లేఖ..