AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia – Ukraine War: ‘అమ్మా స్వర్గంలో కలుస్తా!’.. రష్యా దాడిలో చనిపోయిన తల్లికి 9 ఏళ్ల బాలిక లేఖ..

Russia - Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ భీకర పోరు ప్రారంభమై 45 రోజులు దాటుతున్నప్పటికీ..

Russia - Ukraine War: ‘అమ్మా స్వర్గంలో కలుస్తా!’.. రష్యా దాడిలో చనిపోయిన తల్లికి 9 ఏళ్ల బాలిక లేఖ..
Mother
Shiva Prajapati
|

Updated on: Apr 13, 2022 | 6:44 AM

Share

Russia – Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ భీకర పోరు ప్రారంభమై 45 రోజులు దాటుతున్నప్పటికీ.. యుద్ధం మాత్రం ముగియలేదు. రష్యా దాడుల్లో వేలాది మంది ఉక్రెనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులు అవుతున్నారు. చిన్న పిల్లలు మొదలు, ముసలి వాళ్ల వరకు రష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు అయినవాళ్లను సుదూర ప్రాంతాలకు(సురక్షితమైన ప్రాంతాలు) పంపిస్తున్నారు. అయితే, తాజాగా రష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పియిన తన తల్లికి ఓ చిన్నారి రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది. చనిపోయిన తన తల్లికి రాసిన లేఖలో తొమ్మిదేళ్ల ఉక్రేనియన్ బాలిక.. స్వర్గంలో తనను కలుసుకుంటానని వాగ్దానం చేసింది. ఉక్రెయిన్‌లోని బోరోడియంకా నివాసి అయిన గల్లియా రష్యా దాడిలో తన తల్లి మరణించిన తర్వాత ఈ లేఖ రాసింది. ఈ లెటర్ ఫోటోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారు అంటోన్ గెరాష్చెంకో ట్విట్టర్‌లో షేర్ చేశారు.

#Borodyankaలో మరణించిన తన తల్లికి 9 ఏళ్ల బాలిక రాసిన లేఖ ఇక్కడ ఉంది అంటూ క్యాప్షన్ పెట్టిన గెరాష్‌చెంకో.. ‘‘అమ్మా! నువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమ తల్లివి. నేను నిన్ను ఎప్పటికీ మరచిపోలేను. స్వర్గంలో సంతోషంగా ఉండు. నేను మంచి వ్యక్తిగా ఉండి స్వర్గానికి వచ్చేందుకు నా వంతు కృషి చేస్తాను. స్వర్గంలో కలుస్తాను! గలియా.’’ అంటూ రాసుకొచ్చింది. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉక్రెయిన్‌లో నెలకొన్ని దారుణ పరిస్థితులకు ఈ లేఖ అద్దం పడుతోందన్నారు. రష్యా చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Turmeric Effects: దుస్తులపై పసుపు మరకలను పోవడం లేదా?.. అయితే, టిప్స్ ఫాలో అవండి..!

Relationship Tips: ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్.. రిలేషన్‌షిప్‌లో ఈ తప్పులు అస్సలు చేయకండి..!

Viral Video: అయ్యయ్యో.. బిస్కెట్ అయిన యువతి ఫీట్.. ఫుల్లుగా నవ్వుకుంటున్న నెటిజన్లు..!