US SHOOTING: న్యూయార్క్ నగరంలో బాంబులు, తుపాకీ కాల్పులతో విధ్వంసం.. 13మంది మృతి, పదుల సంఖ్యలో క్షతగాత్రులు
అమెరికాలో మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. న్యూయార్క్ నగరంలో బాంబులు, తుపాకీ కాల్పులతో విధ్వంసం సృష్టించారు దుండగులు. ఈ ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయారు.
US SHOOTING: అమెరికా(America)లో మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. న్యూయార్క్(New York) నగరంలో బాంబులు, తుపాకీ కాల్పులతో విధ్వంసం సృష్టించారు దుండగులు. న్యూయార్క్ నగరం మళ్లీ ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. బ్రూక్లీన్ సబ్‌స్టేషన్(Brooklyn subway station) దగ్గర పేలుళ్లతో పాటు , కాల్పుల ఘటన కలకలం రేపింది. కాల్పుల్లో 13 మంది చనిపోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. జనం ప్రాణభయంతో పరగులు పెట్టారు. అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సబ్‌స్టేషన్ దగ్గర పేలుడు పదార్ధాలు కూడా లభ్యమయ్యాయి. అనుమానితుడిని న్యూయార్క్ పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. మరో అనుమానితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయాడని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. దీంతో న్యూయార్క్‌లో మెట్రోస్టేషన్లను మూసేశారు.
రద్దీ సమయంలో బ్రూక్లిన్ సబ్‌వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం జరిగిన భయంకరమైన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సన్‌సెట్ పార్క్‌లోని డి, ఎన్, ఆర్ లైన్‌ల కోసం 36వ స్ట్రీట్ స్టేషన్‌లో ఉదయం 8:30 గంటలకు రక్తపాత సంఘటన జరిగింది.
Multiple people shot at 36 street station by two people in #sunsetpark. All are currently being transported to the hospital #NewYork #Brooklyn pic.twitter.com/3Va2iXf0JQ
— Derek French Photo (@derekcfrench) April 12, 2022
ఈ దారుణ ఘటనలో గాయపడ్డ ముగ్గురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. ఆరెంజ్ చొక్కాతో గ్యాస్ మాస్క్ ధరించిన 5 అడుగుల 5 నల్లజాతి వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. “అతను మొదట MTA వర్కర్ అని అనుకున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ శ్రద్ధ పెట్టడం ఇష్టం లేదు. నీకు తెలుసు? మీకు నారింజ రంగు వచ్చింది, ”ఆమె చెప్పింది. రక్తంతో తడిసిన సబ్‌వే ప్లాట్‌ఫారమ్ అంతస్తులు, స్టేషన్‌లోని గాయపడిన వ్యక్తులను చూపించే గ్రాఫిక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే పేలుడు, సామూహిక కాల్పులు లేదా రెండింటిలో ఎంత మంది బాధితులు గాయపడ్డారనే దానిపై ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసు అధికారులు తెలిపారు. న్యూయార్క్ నగరానికి చెందిన బాంబు స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తోంది. పేలుడు ఘటనపై ఎఫ్‌బీఐ వెంటనే దర్యాప్తును వెంటనే చేపట్టింది. తొలుత బాంబు విసిరారని , అది పేలకపోవడంతో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు ప్రాధమిక దర్యాప్తులో తేలింది. Read Also… CJI NV Ramana: రేప్ నిందితుడు బెయిల్‌పై వస్తే ఫ్లెక్సీలు వేసి సంబరాలు చేసుకుంటారా? చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర వ్యాఖ్యలు..