బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో స్టూడెంట్ లీడర్ నహిద్ ఇస్లామ్ ప్రధాన పాత్ర పోషించాడు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు. అవును అమవీరులకు ఇచ్చే రిజర్వేషన్ రద్దు చేయాలంటూ బంగ్లాదేశ్‌లో విద్యార్ధుల తిరుగుబాటుకు 26 ఏళ్ల యువకుడు నాయకత్వం వహించాడు .. ఢాకా యూనివర్సిటీకి చెందిన నహిద్ ఇస్లామ్ నేతృత్వం లోనే ఈ ఉద్యమం సాగింది. షేక్ హసీనా ప్రభుత్వానికి నహిద్ ముచ్చెమటలు పట్టించారు. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కూడా అతడే కీలకపాత్ర వహించబోతున్నాడు. సైప్యంతో చర్చల్లో నహిద్ ఇస్లామ్ పాల్గొంటున్నాడు.
వాస్తవానికి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం బంగ్లాదేశ్‌లో చినికిచినికి గాలివానగా మారింది. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు నహిద్ ఇస్లామ్. జులైలో పోలీసులు అతడిని అరెస్ట్ చేసినప్పటికి వెనుకాడలేదు.
నహిద్‌తో పాటు ఇతర విద్యార్థి నాయకులు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌తో భేటీ అయ్యారు. . నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ చీఫ్ అడ్వైజర్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విద్యార్ధులు కోరుతున్నారు. విద్యార్థి ఉద్యమం ఆమోదం లేని ఏ ప్రభుత్వాన్ని అంగీకరించబోమని నహిద్ ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నాడు.
1998 సంవత్సరంలో ఢాకాలో నహిద్ జన్మించాడు. అతడి తండ్రి టీచర్. అతడి సోదరుడు నఖిబ్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. పోలీసులు చిత్రహింసలు పెట్టినప్పటికి షేక్ హసీనా సర్కార్ కుప్పకూలే వరకు పంతంతొ పోరాడారు నహిద్. మానవ హక్కుల కార్యకర్తగా కూడా నహిద్ ఇస్లామ్‌కు గుర్తింపు ఉన్నది.
షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నహిద్ ప్రచారం చేశాడు. విద్యార్థి నాయకులను ఉగ్రవాదులుగా పోల్చడంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశాడు.
జూలై 19వ తేదీన సుమారు 25 మంది నహిద్ ఇస్లామ్‌ను ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. అతని కళ్లకు గంతలు కట్టి, చేతులకు బేడీలు వేసి వేధించారు. రెండు రోజుల తర్వాత పూర్బాచల్ వద్ద ఉన్న ఓ బ్రిడ్జ్ కింద అతన్ని అపస్మారక స్థితిలో గుర్తించారు. జూలై 26వ తేదీ మరోసారి కూడా అతన్ని కిడ్నాప్ చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..