Boat Capsized: సముద్రంలో విషాదం.. పడవ బోల్తా.. 34 మంది మృతి!
Boat Capsized: దక్షిణ చైనా సముద్రం నుండి వియత్నాం వైపు తుఫాను 'విఫా' కదులుతున్నప్పుడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పడవ బోల్తా పడింది. ఈ సమయంలో ఆ ప్రాంతంలో బలమైన గాలులు, భారీ వర్షం, మెరుపులు వీచాయని నివేదికలు వచ్చాయి..

వియత్నాంలో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం హలోంగ్ బేలో పర్యాటక పడవ బోల్తా పడిన ఘటనలో 34 మంది మరణించగా, డజనుకు పైగా ప్రజలు గల్లంతయ్యారు. వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మీడియా ప్రకారం, పడవలో మొత్తం 53 మంది టూరిస్ట్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రం నుండి వియత్నాం వైపు తుఫాను ‘విఫా’ కదులుతున్నప్పుడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పడవ బోల్తా పడింది. ఈ సమయంలో ఆ ప్రాంతంలో బలమైన గాలులు, భారీ వర్షం, మెరుపులు వీచాయని నివేదికలు వచ్చాయి. బోటు మునిగిపోవడంతో నీటిలో గల్లంతైన వారిని కాపాడేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి సహాయకబృందాలు.
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని సందర్శించడానికి పర్యాటకుల బృందం పడవలో వెళ్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో బలమైన గాలులు, వర్షం ప్రారంభమైంది. ఈ భయంకరమైన విపత్తు మధ్యలో పడవ బోల్తా పడింది. నీటిలో పడవ బోల్తా పడటంతో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Honda Activa 6G: హోండా యాక్టివా 6G.. 316 కి.మీ మైలేజ్.. రూ.5 వేలు చెల్లిస్తే చాలు స్కూటీ మీ సొంతం!
ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ పడవ ప్రయాణాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సంవత్సరం దక్షిణ చైనా సముద్రాన్ని తాకిన మూడవ తుఫాను ‘వైఫా’, ఇది వచ్చే వారం ప్రారంభంలో వియత్నాం ఉత్తర తీరాన్ని తాకవచ్చు. తుఫాను ఈ ప్రమాదకరమైన వాతావరణానికి కారణమైంది. ఇది విమాన ప్రయాణాన్ని కూడా ప్రభావితం చేసింది. శనివారం 9 ఇన్‌కమింగ్ విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చిందని, 3 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు నోయి బాయి విమానాశ్రయం తెలిపింది.
ఇది కూడా చదవండి: Viral Video: ఏం తెలివిరా నాయానా..! ఇలాంటి దొంగతనం మీరు ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
