Europe Hot Weather: నిప్పుల కుంపటికగా మారిన ఐరోపా.. వడగాలులకు 15 వేల మంది మృతి.. ఎండ వేడికి జంవుతులు విలవిల

|

Nov 08, 2022 | 7:42 PM

పశ్చిమ యూరప్‌లో అయితే కని వినీ ఎరుగని విధంగా ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ముఖ్యంగా వేడిగాలులకు పోర్చుగల్‌, స్పెయిన్‌లు ఉడికిపోతున్నాయి. స్పెయిన్‌లోని సివెల హాటెస్ట్‌ స్పాట్‌గా మారింది. వరుసగా అక్కడ 41 డిగ్రీలపైనే రికార్డ్‌ అయిన ఉష్ణోగ్రత మరింత పెరుగుతూ 46 డిగ్రీలకు చేరింది.

Europe Hot Weather: నిప్పుల కుంపటికగా మారిన ఐరోపా.. వడగాలులకు 15 వేల మంది మృతి.. ఎండ వేడికి జంవుతులు విలవిల
Hot Weather In Europe
Follow us on

ఓ వైపు కొన్ని దేశాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. నదులు ఉగ్రరూపం దాల్చి డేంజర్‌ లెవెల్స్‌లో ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. వాగులు వంకలు పోటెత్తున్నాయి. ఇదీ ఇండియా, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, అమెరికాలోని పరిస్థితి. కానీ యూరప్‌ మాత్రం చండ ప్రచండమైన ఎండలతో నిప్పుల కుంపటిగా ఉంది. వడగాడ్పులకు జనం అల్లాడిపోతున్నారు. ఎండలకు ఏకంగా 15 వేల మంది మృతి చెందారంటే పరిస్తితి ఎంత భయానకంగా ఉందో తెలిసిపోతుంది. పశ్చిమ యూరప్‌లో అయితే కని వినీ ఎరుగని విధంగా ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ముఖ్యంగా వేడిగాలులకు పోర్చుగల్‌, స్పెయిన్‌లు ఉడికిపోతున్నాయి. స్పెయిన్‌లోని సివెల హాటెస్ట్‌ స్పాట్‌గా మారింది. వరుసగా అక్కడ 41 డిగ్రీలపైనే రికార్డ్‌ అయిన ఉష్ణోగ్రత మరింత పెరుగుతూ 46 డిగ్రీలకు చేరింది. పోర్చుగల్‌లో అయితే టెంపరేచర్‌ రికార్డ్‌ స్థాయిలో 47 డిగ్రీలను టచ్‌ చేసింది.

ఇప్పటి వరకు దేశంలో రికార్డ్‌ అయిన మాగ్జిమమ్‌ టెంపరేచర్‌ 45.2 డిగ్రీలు. అది కూడా 1995 జూలై 24న నమోదైంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ రికార్డ్‌ బ్రేక్‌ అయింది. తీవ్రమైన ఎండలు ఐరోపాను కరువు కోరల్లోకి నెట్టేస్తున్నాయి. పెద్ద పెద్ద కొలనులు కూడా ఎండిపోయాయి. ఎండలను తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు యూరప్‌ దేశాల ప్రజలు. షవర్ల కింద తడస్తూ సేద తీరుతున్నారు ప్రజలు. సాయంత్రమైతే నదీ తీరాలకు చేరుతున్నారు. జూలలో జంతువులు కూడా ఎండల వేడికి విలవిల లాడుతున్నాయి. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌ జూలో జంతువులపై నీళ్లు చల్లుతూ చల్లబరుస్తున్నారు. ఈ హాట్‌ హాట్‌ వాతావరణం ఎప్పటికి చల్లబడుతుందోనని యూరప్‌ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఐరోపాలో వేడిగాలులకు ఈ సంవత్సరంలో 15వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. స్పెయిన్‌, పోర్చుగల్‌లో సుమారు 4వేల మంది, యూకేలో వెయ్యికిపైగా, బ్రిటన్‌లో నాలుగు వేలు, జర్మనీలో ఐదు వేల మందికిపై మరణాలు నమోదయ్యాయని యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ హన్స్ హెన్రీ క్లూగే పేర్కొన్నారు. పలు దేశాల్లో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

కరోనా మహమ్మారికి ముందు 2019లో జూన్‌ 1 – 22 ఆగస్టు 2022 మధ్య కాలంలో పోలిస్తే మరణాల సంఖ్య 11వేలు ఉన్నట్లు ఫ్రాన్స్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ స్టడీస్‌ పేర్కొంది. జూన్‌ మధ్య హీట్‌వేవ్‌ కారణంగా మరణాల సంఖ్య మొదలైనట్లు ఐఎన్‌ఎస్‌ఈఈ గణాంకాలు పేర్కొన్నాయి. సాధారణంగా హీట్‌వేవ్స్‌ జూలైలో సంభవిస్తుంటాయి. ఐరోపాలో ఉష్ణోగ్రతలు 1961-2021 మధ్య కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. సగటున దశాబ్దానికి 0.5 డిగ్రీల చొప్పున వేడి పెరుగుతున్నది. ప్రపంచ వాతావరణ సంస్థ ఈ వారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అత్యంత వేగంగా వేడెక్కుతున్న ప్రాంతం ఐరోపానే. ఈ ప్రాంతంలో గత 50 ఏళ్లుగా విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా 1.48లక్షల మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

మరో వైపు వాతావరణ మార్పు సంఘటనలతో వందలాది మరణాలు నమోదవుతుండగా.. అర మిలియన్‌ కంటే ఎక్కువ మంది ప్రజల ఆరోగ్యాలపై నేరుగా ఎఫెక్ట్‌ పడిందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. వరదలు, తుఫానులు 84 శాతం మందిపై ప్రభావం చూపాయని వెల్లడించింది.  మారుతున్న వాతావరణ మార్పుల దృష్ట్యా, భవిష్యత్తు గురించి మనం అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను తక్షణమే తగ్గించేందుకు గతంలో జరిగిన ఒప్పందాలను అమలు చేసేందుకు ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సు ఈజిప్టులోని షర్మ్‌ ఎల్‌ షేక్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు సమావేశమైన నేపథ్యంలో ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..