Lock Down: ఫ్లూ కారణంగా ఆ దేశంలో లాక్‌డౌన్ విధించే దిశగా అడుగులు.. వద్దు బాబోయ్ అంటోన్న ప్రజలు.
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయట పడిందని సంతోషించే తరుణంలో ఫ్లూ రూపంలో మరో మహమ్మారి ముంచుకొస్తోంది. ఇన్‌ప్లూయెంజా వైరస్ రూపంలో మరోసారి ప్రజలను హడలెత్తిస్తోంది...

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయట పడిందని సంతోషించే తరుణంలో ఫ్లూ రూపంలో మరో మహమ్మారి ముంచుకొస్తోంది. ఇన్‌ప్లూయెంజా వైరస్ రూపంలో మరోసారి ప్రజలను హడలెత్తిస్తోంది. కరోనా పుట్టినిల్లు అయిన చైనాలోనూ ఫ్లూ పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలోనే చైనాలో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశం కనిపిస్తోంది. ఫ్లూ కట్టడి చేసేందుకు గాను చైనాలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
అయితే చైనా ప్రభుత్వం తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై అక్కడి ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. లాక్‌డౌన్ విధించవద్దంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే జీరో కోవిడ్ పేరుతో డ్రాగన్ కంట్రీ పెట్టిన నిబంధనలను తట్టుకోలేని అక్కడని ప్రజలు లాక్‌డౌన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే.. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. చైనాలో దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి.
మార్చి మొదటివారంలో 25.1 శాతం ఉన్న ఫ్లూ కేసులు గత వారం 41.6 శాతానికి పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అదే సమయంలో కొవిడ్-19 కేసులు 5.1 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గాయని తెలిపింది. ఇక జియాన్ నగరంలో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలైన వ్యాపారాలు, పాఠశాలలను మూసేవేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ ఫ్లూ ప్రభావం భారత్‌లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..