అర్జెంటీనా కరెన్సీపై మారోడోనా బొమ్మ!.. దివంగత పుట్ బాల్ దిగ్గజంకు అరుదైన గౌరవం..
దివంగత ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనాకు అరుదైన గౌరవం దక్కింది. అర్జెంటీనా కరెన్సీపై ఆయన చిత్రాన్ని ముద్రించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

దివంగత ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనాకు అరుదైన గౌరవం దక్కింది. అర్జెంటీనా కరెన్సీపై ఆయన చిత్రాన్ని ముద్రించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘లా పంపా’ ప్రావిన్స్ సెనెటర్ నార్మా డ్యూరాంగో ఈ మేరకు సోమవారం ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్కు ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనను పంపించారు. 1000 పెసో నోటుపై ఒకవైపు మారడోనా చిత్రాన్ని, మరోవైపు హ్యాండ్ ఆఫ్ గాడ్ నమూనాను పొందుపరచనున్నట్లు ఆమె వెల్లడించారు. దీనిపై చట్టసభ సభ్యులదే చివరి నిర్ణయమన్న ఆమె వచ్చే సంవత్సర ప్రారంభంలో తన ప్రతిపాదనను వినిపిస్తానని చెప్పారు. “మన దిగ్గజాన్ని గౌరవించేందుకు మాత్రమే కాకుండా ఆర్థిక లావాదేవీల పరంగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు మారడోనాను తమ తీసుకెళ్ళేందుకు ఇష్టపడతారని భావిస్తున్నా” అని ఆమె పేర్కొన్నారు.




