AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: కరోనా కట్టడికి ఇవి కీలకం.. తాజా పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడించిన అమెరికా పరిశోధకులు

Coroan Mask: కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కులు, భౌతిక దూరం ఎంతో కీలకమని అంతర్జాతీయ,,,,

Coronavirus: కరోనా కట్టడికి ఇవి కీలకం.. తాజా పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడించిన అమెరికా పరిశోధకులు
Subhash Goud
| Edited By: Shiva Prajapati|

Updated on: Apr 16, 2021 | 7:54 AM

Share

Coroan Mask: కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కులు, భౌతిక దూరం ఎంతో కీలకమని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తు్న్నారు. ముఖ్యంగా గది వాతావరణంలో గాలి ద్వారాను వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో భౌతిక దూరం కంటే మాస్కులు, సరైన వెంటిలేషన్‌తో గదులు, ఇండోర్‌ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అయితే సరైన వెంటిలేషన్‌ లేని గదుల్లో గాలిలోనూ వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు ఇప్పటికేపలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో గదులు, ఇండోర్‌ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని అంచనా వేసేందుకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా నిపుణులు ఓ అధ్యయనం చేపట్టారు. ఓ క్లాస్‌ రూమ్‌ మోడల్‌ను రూపొందించి అక్కడి వాతావరణంలో వైరస్‌ ప్రభావం ఎలా ఉందో కంప్యూటర్‌ విధానంలో పరీక్షించారు.

ఇందులో 9 అడుగుల ఎత్తు, 709 చదరపు అడుగుల స్థలంలో తరగతి వాతావరణాన్ని రూపొందించి పరీక్షించారు. నాణ్యమైన మాస్కులు ధరించినట్లయితే ఆరు అడుగుల భౌతిక దూరం లేకున్నా ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు గుర్తించారు. అంతేకాదు.. వెంటిలేషన్‌ ఉన్న, వెంటిలేషన్‌ లేని ప్రాంతాల్లో సూక్ష్మబిందువుల కదలికపై అధ్యయనాన్ని కొనసాగించారు. వెంటిలేషన్‌ లేని గదులతో పోలిస్తే వెంటిలేషన్‌ ఉన్న గదుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం 40 నుంచి 50 శాతం వరకు ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఫ్లోరిడాకు చెందిన నిపుణుడు మైఖేల్‌ కింజెల్‌ తెలిపారు.

మాస్కులు తప్పనిసరిగా ధరిస్తే ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. అమెరికా వ్యాధుల నియంత్రణ నిర్మూలన కేంద్రం (సీడీసీ) ఈ మధ్యే మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. తాజా పరిశోధన కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోందని తాజా పరిశోధనల్లో మైఖేల్‌ గుర్తించారు. సాధ్యమైనంత వరకు మాస్కులు, భౌతిక దూరం ద్వారా కరోనా వైరస్‌ను అరికట్టవచ్చని వారు పేర్కొంటున్నారు.

ఇవీ కూడా చదవండి: Remdesivir: రెమిడిసివర్ ఇంజక్షన్ కొరత కరోనా రెండో వేవ్ ఎదుర్కోవడంలో ప్రభావాన్ని చూపిస్తోందా?

SBI Insurance: కస్టమర్లకు శుభవార్త.. ఎస్‌బీఐ లైఫ్‌ సంపూర్ణ్‌ సురక్ష పాలసీ.. రూ.40 లక్షల లైఫ్‌ కవరేజీతో ఇన్సూరెన్స్‌