టెన్షన్.. శ్రీలంకలో అల్లర్లు, ఒకరు మృతి

ప్రశాంతతకు ఒకప్పుడు మారుపేరు శ్రీలంక. కానీ, ఈస్టర్ రోజు దాడుల తర్వాత అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ రోజు అక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు అక్కడి ప్రజలు. నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్‌ ప్రాంతం మరోమారు అట్టుడికింది. యాంటీ ముస్లిం ర్యాలీలో చోటు చేసుకున్న ఘర్షణలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో ముస్లింల షాపులపై దాడులకు దిగారు ఆందోళనకారులు. వాళ్లని చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలితం లేకపోవడంతో నిరసనకారులపై టియర్ […]

  • Anil kumar poka
  • Publish Date - 12:47 pm, Tue, 14 May 19
టెన్షన్.. శ్రీలంకలో అల్లర్లు, ఒకరు మృతి

ప్రశాంతతకు ఒకప్పుడు మారుపేరు శ్రీలంక. కానీ, ఈస్టర్ రోజు దాడుల తర్వాత అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ రోజు అక్కడ
ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు అక్కడి ప్రజలు. నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్‌ ప్రాంతం మరోమారు అట్టుడికింది. యాంటీ ముస్లిం ర్యాలీలో చోటు చేసుకున్న ఘర్షణలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో ముస్లింల షాపులపై దాడులకు దిగారు ఆందోళనకారులు. వాళ్లని చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలితం లేకపోవడంతో నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. ఆందోళనకారులు దాడులు చేస్తుంటే పోలీసులు సైలెంట్‌గా వున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మసీదులను తగలబెట్టారని, షాపులకు ధ్వంసం చేశారని వాపోయారు. పరిస్థితి జఠిలంకావడంతో కర్ఫ్యూ విధించారు లంక ప్రభుత్వం. హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్తగా సోషల్‌మీడియాపై బ్యాన్ విధించింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తదితర మెసేజింగ్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. తాజా నిర్ణయంతో లంక ప్రజలు కొద్దిరోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా వుండనున్నారు.