ఎఫ్-21 యుద్ధ విమానం.. ఇండియాకు బంపరాఫర్!

లాక్‌హీడ్ మార్టిన్.. అమెరికన్ ఏరో స్పేస్ జెయింట్ కంపెనీ..! ప్రపంచ దేశాలన్నిటికీ యుద్ధ విమానాల్ని సరఫరా చేసే కంపెనీల్లో అతి పెద్దది. దాదాపు 150 బిలియన్ డాలర్ల బడా సైజ్ మార్కెట్ కలిగిన ఈ సంస్థ ఇప్పుడు.. ఇండియా మీద కన్నేసింది. కాదుకాదు.. ఇండియాకు కన్ను గీటుతోంది. లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ కొత్తగా తయారు చేసే F-21 విమానాల్ని కేవలం ఇండియాకు మాత్రమే అమ్ముతామంటూ ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ వివేక్ […]

ఎఫ్-21 యుద్ధ విమానం.. ఇండియాకు బంపరాఫర్!
Anil kumar poka

|

May 14, 2019 | 1:49 PM

లాక్‌హీడ్ మార్టిన్.. అమెరికన్ ఏరో స్పేస్ జెయింట్ కంపెనీ..! ప్రపంచ దేశాలన్నిటికీ యుద్ధ విమానాల్ని సరఫరా చేసే కంపెనీల్లో అతి పెద్దది. దాదాపు 150 బిలియన్ డాలర్ల బడా సైజ్ మార్కెట్ కలిగిన ఈ సంస్థ ఇప్పుడు.. ఇండియా మీద కన్నేసింది. కాదుకాదు.. ఇండియాకు కన్ను గీటుతోంది. లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ కొత్తగా తయారు చేసే F-21 విమానాల్ని కేవలం ఇండియాకు మాత్రమే అమ్ముతామంటూ ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ వివేక్ లాల్. మొత్తం 114 ఎఫ్-21 జెట్స్ కొనుగోలుకు ఆర్డర్ పెడితే.. మిమ్మల్ని మా ‘గ్లోబల్ ఫైటర్ ఎకోసిస్టం’లో చేర్చుకుంటాం అంటూ హామీ ఇస్తున్నారాయన. పైగా.. ‘తమ విమానాల్ని కొనడానికి ఇండియా కమిటైతే.. మరే దేశానికీ ఈ విమానాల్ని అమ్మబోమ’ని కూడా లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ డిసైడ్ అయింది. ఈ విధంగా అమెరికన్, యూరోపియన్, రష్యన్ దేశాలను రెచ్చగొట్టినట్లయింది కూడా!

పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ లాల్.. ఈ అరుదైన విమానాల ప్రత్యేకతల్ని కూడా వివరించారు. ఇండియాలోని 60 ఎయిర్‌ఫోర్స్ స్టేషన్స్‌లో ఎక్కడినుంచైనా ప్రయోగించేందుకు వీలు కలిగేలా ఎఫ్-21 విమానాల్ని రూపొందించామన్నారు. మోసుకెళ్లే ఆయుధాల మోతాదు కూడా మెరుగ్గా ఉంటుందన్నారు. ఆధునీకరించిన ఇంజిన్ మాట్రిక్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ దీని అదనపు ప్రత్యేకతలట. ఇండియా యొక్క ప్రత్యేకమైన అవసరాల్ని గుర్తించి ఎఫ్-21 ఫైట్స్ జెట్స్ తయారుచేశామన్న వివేక్ లాల్.. ఈ కాన్ఫిగరేషన్‌ని ప్రపంచంలో మరెవ్వరికీ విక్రయించబోమన్నారు.

ఇటీవలే 114 ఎఫ్-21 జెట్స్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ముందస్తు టెండర్ దాఖలు చేసింది. దీని ఖరీదు 18 బిలియన్ అమెరికన్ డాలర్లు.. (అక్షరాలా లక్షా 26 వేల కోట్ల రూపాయలు). ఇటీవలి కాలంలో మిలిటరీ బలోపేతం కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. అందుకే.. ఈ భారీ డీల్ ఎక్కడ చేజారిపోతుందోనన్న బెంగతోనే లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ ఇటువంటి ఆకట్టుకునే ప్రకటనలు చేస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu