AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Anti Hijab Protest: ఇరాన్‌లో ఆగని హిజాబ్‌ వ్యతిరేక ప్రదర్శనలు.. ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్‌ బలగాలు..

ఇరాన్‌లో అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 420మంది మరణించినట్లు మానవహక్కుల సంఘాలు ప్రకటించాయి. కుర్దులే టార్గెట్‌గా ఇరాన్‌ బలగాలు..

Iran Anti Hijab Protest: ఇరాన్‌లో ఆగని హిజాబ్‌ వ్యతిరేక ప్రదర్శనలు.. ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్‌ బలగాలు..
Iran Hijab Protest
Shiva Prajapati
|

Updated on: Nov 23, 2022 | 6:10 AM

Share

ఇరాన్‌లో అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 420మంది మరణించినట్లు మానవహక్కుల సంఘాలు ప్రకటించాయి. కుర్దులే టార్గెట్‌గా ఇరాన్‌ బలగాలు దాడులు చేస్తున్నాయి. ఇరాన్‌లో అల్లర్లు ఆగట్లేదు. హిజాబ్‌ ధరించలేదని ఓ యువతిని చిత్రహింసలు పెట్టడంతో లాకప్‌లోనే చనిపోయిన ఘటన ఇరాన్‌ పౌరుల రక్తం మరిగిపోయేలా చేసింది. సెప్టెంబర్‌లో చెలరేగిన హింస.. ఇప్పటికీ కొనసాగుతోంది. పోలీసుల కాల్పులు, ఆర్మీ హింసాకాండతో.. వందల మంది పౌరులు చనిపోయారు. కేవలం ఈ వారం రోజుల్లోనే 72మంది చనిపోయారంటే.. పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖొమేనీ ఇంటిని ప్రొటెస్టర్స్‌ తగలబెట్టిన తర్వాత ఆర్మీ రంగంలోకి దిగింది. నిరసనకారులను ఎక్కడికక్కడ అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరాన్‌లో 1979 ఇస్లామిక్‌ రివల్యూషన్‌ తర్వాత అతిపెద్ద తిరుగుబాటు ఇదే. మారుతున్న కాలం.. పరిస్థితులతో పాటు.. దేశం మారకపోవడంతో ప్రజల్లో అంతర్లీనంగా ఆగ్రహావేశాలు గూడుకట్టుకున్నాయి. ఇప్పుడు యువతి లాకప్‌డెత్‌తో అవన్నీ కట్టలు తెంచుకున్నాయి. సుప్రీం లీడర్‌ పెట్టే అడ్డమైన రూల్స్‌తో విసుగెత్తి.. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. ఇక బోర్డర్‌ అవతల ఇరాక్‌లో ఉన్న కుర్దు గ్రూపులే ఈ అల్లర్లకు కారణమంటూ వారిపైనా దాడులు చేస్తోంది ఇరాన్‌.

ఇప్పటివరకు ఇరాన్‌ బలగాల చేతిలో 420మంది చినిపోతే.. 50మంది చిన్నారులు, 21మంది మహిళలు ఉన్నట్లు ఇరాన్‌ హ్యూమన్‌రైట్స్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించింది. ఇక ఇరాన్‌లో కుర్దులు ఎక్కువగా నివసించే పట్టణాల్లో అట్రాసిటీలు భారీగా ఉన్నాయి. మహబాద్‌, జావన్‌రౌద్‌, పిరన్‌షహర్‌లో అల్లర్లను కంట్రోల్‌ చేసే క్రమంలో మారణకాండ కూడా జరుగుతోంది. కుర్దిష్‌ గ్రూప్స్‌పై డైరెక్టుగా మిషిన్‌ గన్స్‌తోనే ఇరాన్‌ బలగాలు ఎటాక్‌ చేస్తున్నాయని అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సౌకర్యాన్నీ నిలిపివేడంపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌ ప్రభుత్వం తమకు ఇష్టమొచ్చినపుడు, ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను ఆపేస్తోంది. ఇరాన్‌లోనే కాదు.. హిజాబ్‌కి వ్యతిరేకంగా వివిధ దేశాల్లోనూ అల్లర్లు జరుగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 126మంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు