US President: ఇప్పటికీ అదో పెద్ద ‘మిస్టరీ’.. ప్రపంచానికే ప్రశ్నగా దేశాధ్యక్షుడి హత్య.. నాడు ఏం జరిగిందంటే..

అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నెడీని హత్య చేసిన ఓస్వోల్డ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన రెండు రోజుల తరువాత ఓస్వాల్డ్.. కెన్నెడీ మద్దతుదారుల చేతిలో

US President: ఇప్పటికీ అదో పెద్ద ‘మిస్టరీ’.. ప్రపంచానికే ప్రశ్నగా దేశాధ్యక్షుడి హత్య.. నాడు ఏం జరిగిందంటే..
John F Kennedy
Follow us

|

Updated on: Nov 23, 2022 | 7:00 AM

అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నెడీని హత్య చేసిన ఓస్వోల్డ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన రెండు రోజుల తరువాత ఓస్వాల్డ్.. కెన్నెడీ మద్దతుదారుల చేతిలో హతమయ్యాడు. ఈ సంఘటన మొత్తం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ సంఘటన ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. నేటికీ ఈ కేసును ఛేదించలేదు.

అమెరికా చరిత్రలో ఏ ఎన్నికల్లోనూ ఓడిపోని అధ్యక్షుడు కూడా ఉన్నారు. అతనే అమెరికాకు రెండవ అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డును కలిగి ఉన్న జాన్ కెన్నెడీ. అయితే ఆయన హత్య యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కేవలం 43 సంవత్సరాల వయస్సులోనే అమెరికాకు 35వ అధ్యక్షుడైన జాన్ కెన్నెడీ.. 2 సంవత్సరాల, 10 నెలల, రెండు రోజులు అమెరికా అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. జాన్ కెన్నెడీ 22 నవంబర్ 1963న అమెరికాలోని టెక్సాస్‌లో గల డల్లాస్‌లో కారులో వెళ్తుండగా దారుణ హత్యకు గురయ్యాడు.

ఓస్వాల్డ్ అనే వ్యక్తి జాన్ కెన్నెడీని కాల్చి చంపాడు. పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసినప్పటికీ.. రెండు రోజుల రుతవాత ఓస్వాల్డ్ కెన్నెడీ మద్దతుదారుల చేతిలో హతమయ్యాడు. ఈ ఘటనతో మొత్తం కేసు మిస్టరీగా మారిపోయింది. ఇది నేటికీ చేధించలేకపోయారు అక్కడి అధికారులు.

ఇవి కూడా చదవండి

రష్యా, క్యూబా పై అనుమానం..

కెన్నెడీ హత్య తరువాత ఓస్వాల్డ్‌ను పోలీసులు విచారించారు. అయితే, అతను ఏమీ చెప్పలేదు. కెన్నెడీని ఎందుకు చంపావంటే నోరు మెదపలేదు. అంతలోనే అతను దారుణ హత్యకు గురయ్యాడు. దాంతో కెన్నెడీ హత్య మిస్టరీగా మారిపోయింది. ఈ హైప్రొఫైల్ కేసును విచారించిన ఎఫ్‌బిఐ, వారెన్ కమీషన్ ఓస్వాల్డే హంతకుడు అని నిర్ధారించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే, ఓస్వాల్ హత్య తరువాత కూడా చాలా విషయాలు తెరపైకి వచ్చాయి. కెన్నెడీ హత్యకు క్యూబాతో సంబంధం ఉందని కొందరు ప్రచారం చేశారు. అప్పటి క్యూబా ప్రధాని ఫిడెల్ క్యాస్ట్రోను ప్రసన్నం చేసుకునేందుకు లీ హార్వే ఓస్వాల్ ఇలా చేశారని ప్రచారం జరిగింది. ఇక కెన్నెడీ హత్య వెనుక రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందని మరొక వాదన కూడా ఉంది. ఎవరి రూమర్స్ ఎలా ఉన్నా.. కెన్నెడీ హత్య నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

కెన్నెడీ హత్య.. అనుమానాస్పద మహిళ..

కెన్నెడీ హత్య సమయంలో అక్కడ అనుమానాస్పదంగా ఒక మహిళ కూడా కనిపించింది. ఆమె పేరు ‘ది బాబుష్కా లేడీ’. నేటికీ ఆ మహిళ చిత్రాలు ఉన్నాయి. కెన్నెడీపై కాల్పులు జరిపిన సమయంలో ఆ మహిళ చేతిలో కెమెరా లాంటి పిస్టల్ ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ మహిళ నిజ రూపం తెలియరాలేదు. అంతేకాదు.. ఆమె చేతిలో ఉన్న రివాల్వరా? కెమెరా? అనేది నిర్ధారణ కాలేదు. ఇలాంటి ఎన్నో విషయాలు తెరపైకి రావడంతో కెన్నెడీ హత్యపై అనుమానాలు మరింత పెరిగాయి. కానీ, ఆయన మృతికి గల కారణాలపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.

హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన తర్వాత నేవీలో చేరిక..

కెన్నెడీ 29 మే 1917న USAలోని బ్రూక్లిన్‌లో జన్మించారు. అతని తండ్రి అమెరికాలోని విజయవంతమైన వ్యక్తులలో ఒకరు. అతని వ్యాపారం ఫీల్డ్ ఇండస్ట్రీ నుండి స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్ వరకు విస్తరించింది. 1938లో, తండ్రి అమెరికా రాయబారిగా బ్రిటన్‌కు చేరుకున్నారు. 21 ఏళ్ల కెన్నెడీ కూడా అతనితో పాటు కార్యదర్శిగా ఉన్నారు. కెన్నెడీ హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన తర్వాత 1941లో నౌకాదళంలో చేరారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. అతని అన్నయ్య యుద్ధంలో చనిపోయాడు. 1945లో నౌకాదళాన్ని విడిచిపెట్టిన తర్వాత రాజకీయాల్లోకి కొత్త నాంది పలికారు. 1946లో తొలి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆనాటి నుంచి కెన్నెడీ ఎన్నడూ ఎన్నికల్లో ఓడిపోలేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్