మరో బాంబు పేలుడుతో వణుకుతోన్న శ్రీలంక..
శ్రీలంక రాజధాని కొలంబోలో మరో బాంబ్ పేలుడు కలకలం సృష్టించింది. నవోయ్ థియేటర్ దగ్గర భద్రతా దళాలు బాంబులను నిర్వీర్యం చేస్తుండగా ఒక్కసారిగా బాంబ్ పేలింది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా..? లేదా..? అన్న విషయం తెలియలేదు. శ్రీలంకలో మరిన్ని దాడులకు కుట్రపన్నామని ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. వ్యాన్‌లో భారీగా పేలుడు పదార్థాలు తరలించినట్టు వార్తలు అందాయి. దీంతో మరోసారి దేశ వ్యాప్తంగా పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు, భద్రతా దళాలు. న్యూజిలాండ్‌లో ముస్లింల ఊచకోతకు […]
శ్రీలంక రాజధాని కొలంబోలో మరో బాంబ్ పేలుడు కలకలం సృష్టించింది. నవోయ్ థియేటర్ దగ్గర భద్రతా దళాలు బాంబులను నిర్వీర్యం చేస్తుండగా ఒక్కసారిగా బాంబ్ పేలింది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా..? లేదా..? అన్న విషయం తెలియలేదు. శ్రీలంకలో మరిన్ని దాడులకు కుట్రపన్నామని ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. వ్యాన్‌లో భారీగా పేలుడు పదార్థాలు తరలించినట్టు వార్తలు అందాయి. దీంతో మరోసారి దేశ వ్యాప్తంగా పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు, భద్రతా దళాలు. న్యూజిలాండ్‌లో ముస్లింల ఊచకోతకు ప్రతీకారంతోనే ఈ దాడులంటూ ఐసిస్ ప్రకటించిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.