Everest: పట్టుదల అంటే ఇదే మరి.. రెండు కాళ్లను కోల్పోయినప్పటికీ ఎవరెస్టు ఎక్కేసి సరికొత్త రికార్డు సృష్టించాడు

|

May 22, 2023 | 4:06 AM

ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలంటే చాలవరకు శ్రమ, కృషి, పట్టుదల ఉండాలి. అది ఎక్కాలని ప్రయత్నించి విఫలమైనవాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. కాళ్లు చేతులు అన్ని బాగుండి ఆ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నించినప్పటికి శరీరం సహకరించక కొంతమంది వెనక్కి తిరిగి వచ్చేస్తుంటారు.

Everest: పట్టుదల అంటే ఇదే మరి.. రెండు కాళ్లను కోల్పోయినప్పటికీ ఎవరెస్టు ఎక్కేసి సరికొత్త రికార్డు సృష్టించాడు
Hari Buddhamakar
Follow us on

ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలంటే చాలవరకు శ్రమ, కృషి, పట్టుదల ఉండాలి. అది ఎక్కాలని ప్రయత్నించి విఫలమైనవాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. కాళ్లు చేతులు అన్ని బాగుండి ఆ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నించినప్పటికి శరీరం సహకరించక కొంతమంది వెనక్కి తిరిగి వచ్చేస్తుంటారు. మరికొందరు విజయవంతంగా ఎక్కేస్తారు. కానీ తన రెండు కాళ్లు కోల్పోయి కృత్రిమ కాళ్లతోనే బ్రిటిష్ గూర్ఖా మాజీ సైనికుడు హరి బుద్ధమగర్(43) ఎవరెస్టును అధిరోహించి రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని శుక్రవారం విజయవంతంగా ఎక్కి ఆ విభాగంలో తొలి వ్యక్తిగా నిలిచారు.

2010లో బ్రిటన్‌కు చెందిన బ్రిటీష్‌ గూర్ఖా హరి బుద్ధమగర్ రెజిమెంట్‌ తరఫున అఫ్గానిస్థాన్‌లో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. అయితే యుద్ధంలో హరి తన రెండు కాళ్లను కోల్పోయారు. ఆ తర్వాత కృత్రిమ కాళ్లను అమర్చుకున్న ఆయన 2018లోనే ఎవరెస్టు ఎక్కాలని నిర్ణయించుకున్నారు. అయితే 2017లో తెచ్చిన నిబంధనలు ఆయనకు అడ్డంకిగా మారాయి. రిట్‌ పిటిషన్‌ వేయడంతో చివరికి ఆ నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో హరి శుక్రవారం 8,848.86 మీటర్ల ఎత్తుకు చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..