America Warning: అమెరికా, రష్యాల మధ్య కొత్త చిచ్చు.. పుతిన్ వైఖరిపై అగ్రరాజ్యం హెచ్చరిక

అమెరికా, రష్యాల మధ్య కొత్త చిచ్చు రాజుకుంటోంది. అయితే ఇది ఏ అంతర్జాతీయ సమస్య విషయమో కాదు. రష్యా విపక్ష నేత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా.. ఆయన చనిపోతే ఉత్పన్నమయ్యే పరిణామాలపై హెచ్చరికలు జారీ చేయడమే తాజా చిచ్చుకు కారణమైంది.

  • Rajesh Sharma
  • Publish Date - 7:40 pm, Mon, 19 April 21
America Warning: అమెరికా, రష్యాల మధ్య కొత్త చిచ్చు.. పుతిన్ వైఖరిపై అగ్రరాజ్యం హెచ్చరిక
America, Russia Flags And Biden, Putin

America Warning to Russia on Naavelni: అగ్ర రాజ్యాలుగా భావించే అమెరికా (AMERICA), రష్యా (RUSSIA)ల మధ్య మరోసారి వైరం రాజుకుంటోంది. అయితే ఇందుకు ఇరు దేశాలకు సంబంధించిన ఏదైనా అంశం కారణం కావచ్చు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. రష్యా దేశానికి చెందిన అంతర్గత విషయంలో అమెరికా హెచ్చరికలకు దిగడంతో దానికి ప్రతికూలంగా స్పందిస్తోంది. రష్యా ప్రతిపక్షనేత (RUSSIAN OPPOSITION LEADER) జైలు శిక్ష అనుభవిస్తూ గనక మరణిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా రష్యా కు తాజాగా హెచ్చరికలు చేయడమే ఇరుదేశాల మధ్య కొత్త చిచ్చు రాజేసింది. జైలు శిక్ష అనుభవిస్తున్న రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ (ALEXY NAVELNI) ఆరోగ్య పరిస్థితిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ ఆయన జైలులోనే చనిపోయినట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జెక్ సలివాన్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ హెచ్చరికలు జారీ చేశారు. నావల్ని పరిస్థితిపై రష్యా ప్రభుత్వంతో అమెరికా చర్చించిందని సలివాన్ శనివారం వెల్లడించారు. జైలులో ఉన్న నావల్నీకి ఏమైనా జరిగితే అంతర్జాతీయ సమాజానికి రష్యా జవాబుదారీ కావాల్సి వస్తుందని అమెరికా గుర్తు చేసిందని తెలిపారు. నావల్నీ గనక జైలులో మరణిస్తే రష్యా పై ఎలాంటి ఆంక్షలు విధించాలని విషయంపై అమెరికా అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. అయితే ఎలాంటి ఆంక్షలు అనేవి ఇప్పుడే బహిర్గతం చేయడం ఇష్టం లేదని సలివాన్ వివరించారు.

అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ (EUROPEAN UNION) కూడా నావల్నీ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని రష్యా ప్రభుత్వాన్ని యురోపియన్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈమేరకు యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధానం అధినేత జోసెఫ్ బారెల్ ట్వీట్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (PUTIN) ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్షనేత నావల్నీ ప్రస్థుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నారని, ఆయనకు చికిత్స అందించేందుకు వ్యక్తిగత వైద్యులను అనుమతించాలని జైలు అధికారులకు నావల్నీ విజ్ఞప్తి చేశారు. అయితే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (VLADIMIR PUTIN) ఒత్తిడితో జైలు అధికారులు నావల్నీ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దాంతో ఆయన గత మూడు వారాలుగా జైలులోనే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఆయన ఏ క్షణమైన మరణించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. నావెల్ని ఆరోగ్యపరిస్థితిపై వార్తలు పెద్దఎత్తున ప్రచురితం కావడంతో పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా విధానాలను పలు దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా కూడా నావల్నీ ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేసింది. అమెరికా విదేశాంగ శాఖ అధికారులు రష్యా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ప్రతిపక్షనేత మరణిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అమెరికా హెచ్చరించింది. అయితే ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని, విదేశాలు ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని రష్యా ప్రెసిడెంట్ ఆఫీస్ ప్రకటించింది. అమెరికా ధోరణి తీవ్రంగా తప్పు పట్టింది.

మరోవైపు ఉక్రెయిన్ (UKRAINE) లో రష్యన్ అనుకూల వాదులపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో రష్యా .. ఉక్రెయిన్ సరిహద్దులోకి భారీగా సైన్యాన్ని తరలించింది. దీనిపై యూరోపియన్ యూనియన్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. బ్రిటన్ (BRITAIN), జర్మనీ (GERMANY), ఫ్రాన్స్ (FRANCE) దేశాలు హెచ్చరించాయి. నాటో దళాలను ఉక్రెయిన్ కు సంఘీభావంగా నల్ల సముద్రానికి పంపించడం ప్రారంభించింది. ఒకవైపు అమెరికా హెచ్చరికలు.. ఇంకోవైపు యురోపియన్ యూనియన్ దేశాల ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితి.. వెరసి రష్యాకు ఇబ్బందికరంగా పరిస్థితి తయారయింది.
మరిన్ని చదవండి ఇక్కడ : New Coronavirus: కొత్త కరోనా వైరస్‌పై సీసీఎంబీ పరిశోధనలు.. డబుల్ మ్యూటెంట్ మరింత డేంజరస్?

Ayurvedic for Corona: ఆయుర్వేదంతో కరోనాకు చెక్.. అడ్డ సరం మొక్కతో తాజా ప్రయోగాలలో కీలక ముందడుగు