NASA: అంగారకుడిపై అద్భుతం సృష్టించిన నాసా.. మార్స్ పై హెలికాప్టర్ చక్కర్లు!

ఎన్నో ఏళ్ల కల.. ఎవరూ సాధ్యం చేసుకోలేని రికార్డు నాసా సొంతం అయింది. అంగారకుడిపై అద్భుతాన్ని సృష్టించింది. తొలిసారిగా మార్స్ పై ఒక హెలికాప్టర్ ను ఎగరేసింది. భూమికి సుదూర తీరాల్లో.. అత్యంత చల్లని ప్రదేశంలో..హెలికాప్టర్ ను చక్కర్లు కొట్టించి ప్రపంచంతో చప్పట్లు కొట్టించుకుంది

NASA: అంగారకుడిపై అద్భుతం సృష్టించిన నాసా.. మార్స్ పై హెలికాప్టర్ చక్కర్లు!
Nasa Helicopter On Mars
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 19, 2021 | 6:44 PM

NASA: ఎన్నో ఏళ్ల కల.. ఎవరూ సాధ్యం చేసుకోలేని రికార్డు నాసా సొంతం అయింది. అంగారకుడిపై అద్భుతాన్ని సృష్టించింది. తొలిసారిగా మార్స్ పై ఒక హెలికాప్టర్ ను ఎగరేసింది. భూమికి సుదూర తీరాల్లో.. అత్యంత చల్లని ప్రదేశంలో..హెలికాప్టర్ ను చక్కర్లు కొట్టించి ప్రపంచంతో చప్పట్లు కొట్టించుకుంది నాసా! తొలిసారిగా మరో గ్రహంపై హెలికాప్టర్ ఎగిరింది. భూమిపై తప్ప మరే గ్రహంపైనా ఎగరని హెలికాప్టర్ ను మార్స్ లో తిప్పింది నాసా. దీనికి సంబంధించిన ఫోటో విడుదల చేసింది. మార్స్ పై హెలికాప్టర్లు, విమానాలు ఎగిరేందుకు ఎలాంటి అవకాశం ఉందొ తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగం చేపట్టింది నాసా. 19న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అక్కడ హెలికాప్టర్ ఎగిరింది. అంగారక గ్రహం-భూమికి మధ్య దూరం 28 కోట్ల కిలోమీటర్లు ఉంది. అంత దూరం నుంచి డేటా రావాడానికి టైం పట్టింది. ఇప్పుడు హెలికాప్టర్ ఎగరడంతో నాసాకి డేటా అందుతోంది. మార్స్ హెలికాప్టర్‌ను జెపిఎల్ నిర్మించింది. నాసా ప్రధాన కార్యాలయానికి టెక్నికల్ ప్రాజెక్టును ఈ సంస్థనే ఇచ్చింది. నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్, ఏరోనాటిక్స్ రీసెర్చ్ మిషన్ డైరెక్టరేట్, స్పేస్ టెక్నాలజీ మిషన్ డైరెక్టరేట్ ఇందుకు అంగీకారం తెలిపాయి. నాసాలోని అమెస్ రీసెర్చ్ సెంటర్, లాంగ్లీ రీసెర్చ్ సెంటర్ దీన్ని అభివృద్ధి చేశాయి. విమాన పనితీరు విశ్లేషణ సాంకేతిక సహాయాన్ని అందించాయి.

ప్రతికూల పరిస్థితుల్లో…

భూమిపై హెలికాప్టర్లు ఎగరడం సులువే కానీ మార్స్‌పై ఎగరడం అంత తేలిక కాదు. అక్కడి గాలిలో బలం ఉండదు. భూమిపై ఉండే గాలి ప్రెషర్‌తో పోల్చితే మార్స్‌పై ఉన్న గాలి ప్రెషర్ 1 శాతం తక్కువ. అసలు హెలికాప్టర్ ఎగరగలదా అని అనుమానం నాసా శాస్త్రవేత్తలకు ఉంది. కానీ నాసా ఆలోచనలను పటాపంచలు చేసిన హెలికాప్టర్. హెలికాప్టర్ గాలిలో ఎగరడంతో ఊపిరిపీల్చుకున్న పరిశోధకులు. పెర్సెవరాన్స్ రోవర్ పంపినప్పుడే హెలికాప్టర్ ను నాసా పంపించింది. ఏప్రిల్‌ 8 న రోవర్‌లో నుంచి తన రెక్కలను విప్పుకుని బయటకు వచ్చిన బుల్లి హెలికాప్టర్ ఇన్‌ జెన్యూనిటీ. ఈ హెలికాప్టర్ బరువు 1.8 కేజీలు మాత్రమె. 30 రోజుల పాటు మార్స్‌పై చక్కర్లు కొట్టనున్న హెలికాప్టర్. దీనిని ఎగిరేందుకు సిద్ధం చేయడానికి పట్టిన కాలం మాత్రం ఆరు రోజుల నాలుగు గంటలు. రోవర్‌లో ఉన్న ఈ హెలికాప్టర్‌ను బయటకు తీయడం కత్తిమీద సామే దానిని దిగ్విజయంగా పూర్తి చేశారు నాసా పరిశోధకులు. ఇక అక్కడి వాతావరణాన్ని ఈ హెలికాప్టర్‌ తట్టుకోవడం మరో టాస్క్‌. రాత్రి వేళల్లో అక్కడ మైనస్‌ 90 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. దానిని కూడా తట్టుకుంది ఈ హెలికాప్టర్. మార్స్‌పై 10 ఫీట్ల ఎత్తు వరకు ఈ హెలికాప్టర్ ఎగిరింది. ఈ హెలికాప్టర్ లో నావిగేషన్‌ వ్యవస్థతో పాటు.. అత్యాధునిక కెమెరాలు ఉన్నాయి. ఇది పంపే డేటాను కూడా విశ్లేషిస్తే.. మార్స్‌ను మరింత అర్థం చేసుకోవచ్చనేది సైంటిస్టుల మాట. ఇది ఫోటోలు తీయడానికి మాత్రమే పనికి వస్తోందని నాసా చెబుతోంది.

జీవజాలం ఉందా…

మార్స్‌పై జీవజాలం ఉందా? లేదా ? అని తెలుసుకోవడానికి నాసా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఒక్కసారి ఈ ప్రయోగం ఫలితాలు విశ్లేషించేందుకు నాసా ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ అంతా బాగుంటే…మనుషులు జీవించడానికి ఓకే అని చెప్పడమే ఆలస్యం.. వెంటనే మనుషులను తరలించడానికి మస్క్‌ టీమ్ ను రెడీ చేసింది నాసా. అక్కడ కాలనీలు నిర్మించడానికి అబీబో టీమ్ రెడీగా ఉంది.

ఏం చేస్తారంటే…

పురాతన సూక్ష్మజీవుల ఉనికి పై విశ్లేషణ చేస్తారు. అక్కడ జీవజాలం ఉందా లేదా ఉంటే ఎలా ఉంది..ఎంత కాలం కిందట ఉందనే అంశాల పై పరిశోధనలు చేస్తారు. వివిధ సంకేతాల అన్వేషణతో అంగారక గ్రహం లెక్కలు తెలనున్నాయి. అక్కడున్న భూగర్భం, వాతావరణాన్ని నాసా విశ్లేషిస్తుంది. అక్కడ విరిగిపోయి ఉన్న రాళ్లు, దుమ్మును సేకరిస్తున్న నాసా. నాసా మిషన్లు, ESA (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ) సహకారంతో పరిశోధన చేస్తోంది. అక్కడి ఉపరితలం నుండి సేకరించిన మట్టి పై లోతైన విశ్లేషణ సాగిస్తోంది. భూమికి తిరిగి రావడానికి అంగారక గ్రహానికి నాసా మరో శాటిలైట్ ను పంపించనుంది.

ఆ సంఘటనకు గుర్తుగా..

1903లో తొలిసారి విమానాన్ని రైట్ సోదరులు భూమి పై ఎగురేశారు. కాలిఫోర్నియాలోని కిట్టీ హాక్ దగ్గర రైట్ బ్రదర్స్ ఎగురవేసి చరిత్ర సృష్టించారు. దానికి గుర్తుగా.. 1903‌లో ఎగిరిన విమానం తాలూకు చిన్న ముక్కను నాసా ఆ హెలికాప్టర్‌లో ఉంచింది. రైట్ సోదరులకు గౌరవ సూచకంగా నాసా ఈ విధంగా చేసింది.

Also Read: అనుమానాస్పద నౌకపై కోస్ట్ గాడ్స్ దాడి.. రూ.3,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల స్వాధీనం

TS High Court : 48 గంటల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ నిర్ణయం తీసుకోండి.. లేదంటే మేమే ఆదేశాలిస్తాం..టీ సర్కారుకి హైకోర్ట్ ఆదేశం

టీడీఎస్‌ అంటే ఏమిటి? దీన్ని ఉద్యోగి జీతంలో ఎందుకు కట్‌ చేస్తారు?
టీడీఎస్‌ అంటే ఏమిటి? దీన్ని ఉద్యోగి జీతంలో ఎందుకు కట్‌ చేస్తారు?
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!
ఏపీ టెట్‌ ఫలితాలపై వీడని సందిగ్ధత.. ఎప్పటికి వచ్చేనో?
ఏపీ టెట్‌ ఫలితాలపై వీడని సందిగ్ధత.. ఎప్పటికి వచ్చేనో?
4 ఓవర్లలో 1 వికెట్.. టీ20లో గుజరాత్ బౌలర్ ప్రపంచ రికార్డ్
4 ఓవర్లలో 1 వికెట్.. టీ20లో గుజరాత్ బౌలర్ ప్రపంచ రికార్డ్
దోసెలో 8 బొద్దింకలను చూసి మహిళ ఫ్యూజులు ఔట్‌.! బొద్దింకల దోసనా.?
దోసెలో 8 బొద్దింకలను చూసి మహిళ ఫ్యూజులు ఔట్‌.! బొద్దింకల దోసనా.?
బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. సమంత ప్లేస్‌ను కొట్టేసిందిగా..!
బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. సమంత ప్లేస్‌ను కొట్టేసిందిగా..!
బంగ్లా నౌకలో సముద్రపు దొంగల బీభత్సం.! నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక
బంగ్లా నౌకలో సముద్రపు దొంగల బీభత్సం.! నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక
అతనితో ప్రేమలోపడిన రజినీకాంత్ కూతురు.. షాక్ అవుతున్న నెటిజన్స్
అతనితో ప్రేమలోపడిన రజినీకాంత్ కూతురు.. షాక్ అవుతున్న నెటిజన్స్
4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి ఇచ్చిన తాత
4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి ఇచ్చిన తాత
గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు కీలక నక్సల్స్ హతం!
గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు కీలక నక్సల్స్ హతం!