AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుఎస్‌లో మళ్ళీ తుపాకీ మోత.. స్కూల్ ఫుట్‌బాల్ మ్యాచ్ తర్వాత కాల్పులు, ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

అగ్రరాజ్యం అమెరికాలో తుపాల మోత మ్రోగుతూనే ఉంది. తాజాగా అమెరికన్ స్కూల్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. 8 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై హోమ్స్ కౌంటీ షెరీఫ్ విల్లీ మార్చ్ మాట్లాడుతూ ఫంక్షన్‌కు హాజరైన కొంతమంది వ్యక్తుల మధ్య గొడవ తర్వాత కాల్పుల సంఘటన జరిగిందని చెప్పారు. పోరాటం ఎలా మొదలైందో ఇంకా తెలియరాలేదని అన్నారు. ఈ కాల్పుల్లో కారణం పార్టీలో జరిగిన చిన్న వివాదం అని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

యుఎస్‌లో మళ్ళీ తుపాకీ మోత.. స్కూల్ ఫుట్‌బాల్ మ్యాచ్ తర్వాత కాల్పులు, ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు
Mississippi Football TeamImage Credit source: social media
Surya Kala
|

Updated on: Oct 20, 2024 | 4:14 PM

Share

అగ్రరాజ్యం అమెరికాలో మరో సారి పేలిన తుపాకీ… శనివారం సెంట్రల్ మిస్సిస్సిప్పిలో వందలాది మంది వ్యక్తులున్న సమూహంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటన ఓ స్కూల్ ఫుట్ బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. విజయోత్సవం జరుపుకుంటున్న సమయంలో జరిగిందని అధికారులు చెప్పారు. పాఠశాల హోమ్ ఫుట్‌బాల్ విజయాన్ని పురష్కరించుకుని వేడుకలు జరుపుకుంటున్నారని అధికారులు తెలిపారు.

ఈవెంట్‌కు హాజరైన కొందరు వ్యక్తుల మధ్య గొడవ జరిగిన తర్వాత కాల్పులు జరిగాయని హోమ్స్ కౌంటీ షెరీఫ్ విల్లీ మార్చ్ తెలిపారు. అయితే వివాదం ఎలా మొదలైంది.. కాల్పుల వరకూ వెళ్లి ఎలా కాల్పులు జరిగాయో ఇంకా తెలియరాలేదని అన్నారు.

వందలాది మందిపై కాల్పులు పుట్ బాల్ మ్యాచ్ ముగిసిన అనంతరం దాదాపు 200 నుంచి 300 మంది సంబరాలు చేసుకుంటున్నారని.. అయితే ఒక్కసారిగా కాల్పుల శబ్దంవినిపించడంతో గందరగోళం తలెత్తి.. అక్కడ ఉన్న వారు పరుగెత్తడం ప్రారంభించారని షెరీఫ్ ఫోన్‌లో తెలిపారు. కాల్పుల్లో మరణించిన ఇద్దరి వయస్సు 19 సంవత్సరాలు.. ఇక మూడవ వ్యక్తి వయస్సు 25 సంవత్సరాలు. ఈ ఘటనలో గాయాలు పాల్సిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అలబామాలో కాల్పుల ఘటన

అంతకుముందు సెప్టెంబరులో అమెరికాలోని అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ భారీ కాల్పుల ఘటనపై అధికారులు నివేదికను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని ఫైవ్ పాయింట్స్ సౌత్ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు బర్మింగ్‌హామ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ X పోస్ట్‌లో రాసింది.

స్కూల్ కాల్పుల్లో నలుగురు చనిపోయారు సెప్టెంబర్‌లోనే జార్జియా రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. జార్జియాలోని విండర్‌లోని అపాలాచీ హై స్కూల్‌లో ఉదయం 9:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) కాల్పులు జరిగాయి. ఆ తర్వాత అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ దేశంలో హింస సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తోందని అన్నారు. ప్రజల మరణాలపై సంతాపం వ్యక్తం చేసిన బిడెన్, జార్జియాలో సంతోషకరమైన వాతావరణం ఉండాలని కాంక్షించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..