AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H-1B Visa: ట్రంప్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. టెక్‌ కంపెనీల్లో విదేశీయులను తగ్గించే ప్లాన్‌!

హెచ్‌-1బీ వీసా అంటే లక్షలాది మంది భారతీయులకు అమెరికన్ కల. కానీ ఆ కలను నిజం చేసుకున్న వారికి ఇప్పుడు కొత్త సవాల్ వచ్చిపడింది. అమెరికన్ల కంటే తక్కువ వేతనానికి పని చేస్తున్నారంటూ హెచ్‌-1బీ వీసాదారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని సీరియస్‌గా తీసుకున్న ట్రంప్ సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

H-1B Visa: ట్రంప్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. టెక్‌ కంపెనీల్లో విదేశీయులను తగ్గించే ప్లాన్‌!
Donald Trump On New H 1b Wage Rules
Balaraju Goud
|

Updated on: Mar 28, 2026 | 8:40 AM

Share

హెచ్‌-1బీ వీసా అంటే లక్షలాది మంది భారతీయులకు అమెరికన్ కల. కానీ ఆ కలను నిజం చేసుకున్న వారికి ఇప్పుడు కొత్త సవాల్ వచ్చిపడింది. అమెరికన్ల కంటే తక్కువ వేతనానికి పని చేస్తున్నారంటూ హెచ్‌-1బీ వీసాదారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని సీరియస్‌గా తీసుకున్న ట్రంప్ సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ కొత్త రూల్స్‌ అమలులోకి వస్తే విదేశీ ఉద్యోగులకు వచ్చే ప్రమాదం ఏంటి..?

ఐటీ సంస్థల్లో విదేశీ ఉద్యోగులను తగ్గించి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా అమెరికా మరో నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగానే హెచ్‌-1బీ వీసాదారుల వేతనాల పెంపునకు సంబంధించి కార్మిక శాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే హెచ్-1బీ వీసాదారుల కనీస వార్షిక వేతనం 14వేల డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. అమెరికన్లతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు వేతనం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటోందని, దీనివల్ల చౌకగా లభించే ఉద్యోగులకే కంపెనీలు మొగ్గుచూపుతున్నాయని సుదీర్ఘంగా ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్య అధికారులు కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చారు.

ప్రస్తుతం అమెరికాలో స్థానిక ఉద్యోగులతో పోలిస్తే హెచ్‌-1బీ వీసాదారులు సగటున 10,191 డాలర్లు తక్కువగా వార్షిక వేతనం అందుకుంటున్నారు. ముఖ్యంగా కంప్యూటర్, ఐటీ రంగాల్లో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. వాస్తవానికి ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతుల కోసం హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చారు. కానీ, అందుకు భిన్నంగా కొన్ని కంపెనీలు ఈ వీసాను దుర్వినియోగం చేసి తక్కువ వేతనం తీసుకునే ఉద్యోగులను విదేశాల నుంచి నియమించుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన హెచ్‌-1బీల్లో 63శాతం ఎంట్రీ లెవల్‌ ఉద్యోగస్థులే ఉన్నట్లు కార్మికశాఖ గణాంకాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే వేతన పెంపు ప్రతిపాదనలు చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడి సంతకం తర్వాత ఈ ప్రతిపాదనలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.

కార్మిక శాఖ ప్రతిపాదనల ప్రకారం నాలుగంచెల వేతన వ్యవస్థలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలకు కనీస వేతనం 34శాతం, లెవల్‌ 2 వారికి 52శాతం, లెవల్‌ 3 ఉద్యోగులకు 70శాతం, లెవల్‌ 4 ఉద్యోగులకు 88శాతం మేర పెంచాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ ప్రతిపాదనలతో హెచ్‌-1బీ వీసాదారుల సగటు వార్షిక వేతనం 14వేల డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది. దీంతో విదేశీ ఉద్యోగులను నియమించే కంపెనీలు ఏటా 6.56 బిలియన్‌ డాలర్ల వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. H-1B ఉద్యోగులు కీలకమైన నైపుణ్య లోపాలను భర్తీ చేస్తారని, మార్కెట్‌కు పోటీగా ఉండే వేతనాలను పొందుతారని వ్యాపార సంస్థలు వాదిస్తుండగా, ఔట్‌సోర్సింగ్, స్టాఫింగ్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని, మార్కెట్ ధరల కంటే తక్కువ వేతనాలకు ఎంట్రీ లెవెల్ లేదా మధ్య స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సందర్భాలను విమర్శకులు ఎత్తి చూపుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముఖేష్‌ అంబానీ ఇంట్లో తోటమాలి జీతం ఎంతో తెలుసా? షాకింగ్ నిజాలు!
ముఖేష్‌ అంబానీ ఇంట్లో తోటమాలి జీతం ఎంతో తెలుసా? షాకింగ్ నిజాలు!
రాశుల ప్రకారం ఏ లోహం ధరిస్తే శుభం? మీ రాశికి బంగారమా.. వెండా..?
రాశుల ప్రకారం ఏ లోహం ధరిస్తే శుభం? మీ రాశికి బంగారమా.. వెండా..?
చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ
చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ
తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?
తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..
మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు
మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు
నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..
నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం డెడ్ లైన్.. ఈ నెల 9వరకే..
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం డెడ్ లైన్.. ఈ నెల 9వరకే..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..