AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Airstrike: ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ వైమానిక దాడి..ఏడుగురు తాలిబాన్ ఉగ్రవాదుల హతం

ఆప్ఘ‌నిస్థాన్‌లో మ‌ళ్లీ వైమానిక దాడి చోటు చేసుకుంది. ఆప్ఘ‌నిస్థాన్ బాల్ఖు ప్రావిన్స్ లోని చోమ్తాల్ జిల్లాలో జ‌రిగిన వైమానిక దాడిలో ఏడుగురు తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించారు....

Afghanistan Airstrike: ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ వైమానిక దాడి..ఏడుగురు తాలిబాన్ ఉగ్రవాదుల హతం
Subhash Goud
|

Updated on: Dec 26, 2020 | 6:55 AM

Share

ఆప్ఘ‌నిస్థాన్‌లో మ‌ళ్లీ వైమానిక దాడి చోటు చేసుకుంది. ఆప్ఘ‌నిస్థాన్ బాల్ఖు ప్రావిన్స్ లోని చోమ్తాల్ జిల్లాలో జ‌రిగిన వైమానిక దాడిలో ఏడుగురు తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించారు. ఈ దాడిలో మ‌రో ఐదుగురు ఉగ్ర‌వాదులు గాయ‌ప‌డ్డారని ఆప్ఘ‌నిస్థాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ ట్వీట్ చేసింది. ఈ వైమానిక దాడిలో ఉగ్ర‌వాదుల ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ధ్వంసం చేసిన‌ట్లు మంత్రిత్వ‌శాఖ తెలిపింది. ఫ‌రా ప్రావిన్సులోని బోలోక్ జిల్లాలో మ‌రో 8 మంది తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు హ‌త‌మార్చామ‌ని తెలిపింది. తాలిబ‌న్ నాయ‌కులు తమ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు వ‌రుస వీడియోలు వెలువ‌డిన త‌ర్వాత ఈ వైమానిక దాడి జ‌రిపామ‌ని వివ‌రించింది.

ఇలా ఆప్ఘాన్‌లో వ‌‌రుస‌గా ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డుతుండ‌టంతో వైమానిక ద‌ళాలు రంగంలోకి దిగాయి. ఇప్ప‌టికే ఆప్ఘ‌నిస్థాన్‌లో వ‌ర‌స దాడుల‌తో అట్టుడుకుతోంది. త‌ర‌చూ ఏదో ఒక చోట బాంబు పేలుళ్లు చోటు చేసుకోవ‌డంతో వారి దాడుల‌ను వైమానిక ద‌ళాలు తిప్పికొడుతున్నాయి. అలాగే డిసెంబ‌ర్ 20న కాబూల్‌లో జ‌రిగిన బాంబు పేలుడులో 9 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో 20 మంది వ‌ర‌కు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఉద‌యం ర‌ద్దీ అధికంగా ఉండే స‌మ‌యంలో న‌డి రోడ్డుపై బాంబు పేల్చారు ఉగ్ర‌వాదులు. ఇలా ఉగ్ర‌వాదుల వ‌రుస దాడుల‌తో రెచ్చిపోవ‌డంతో వైమాన‌క దాడి చేప‌ట్టి తాలిబ‌న్ ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చారు.

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!