Tv9 Exclusive: ఇండియాతో స్నేహమా..? రణమా..?.. టీవీ9 ఇంటర్వ్యూలో తాలిబన్ ప్రతినిధి ఇంట్రస్టింగ్ కామెంట్స్

| Edited By: Anil kumar poka

Aug 30, 2021 | 8:58 PM

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ని తాలిబాన్లు స్వాధీనం చేసుకుని పక్షం రోజులు కావొస్తోంది. ఆగస్టు 15 న కాబూల్ పతనంతో తాలిబాన్ పరిపాలనకు బీజం పడింది.

Tv9 Exclusive: ఇండియాతో స్నేహమా..? రణమా..?.. టీవీ9 ఇంటర్వ్యూలో తాలిబన్ ప్రతినిధి ఇంట్రస్టింగ్ కామెంట్స్
Shaheen
Follow us on

Taliban Spokesperson Suhail Shaheen Interview : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ని తాలిబాన్లు స్వాధీనం చేసుకుని పక్షం రోజులు కావొస్తోంది. ఆగస్టు 15 న కాబూల్ పతనంతో తాలిబాన్ పరిపాలనకు బీజం పడింది. అమెరికా, ఇంకా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి రావడానికి ఆగస్టు 31 గడువు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ ప్రజలు విమానాశ్రయానికి చేరుకుని పారిపోవడానికి పెద్ద ఎత్తున బయలుదేరారు.

ఈ ఘటనతో అతిపెద్ద మానవతా సంక్షోభం ఏర్పడింది. అంతేకాదు, తాలీబన్ అంశం రోజూ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ తరుణంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలన ఎలా ఉంటుంది? భారతదేశంతోపాటు కాశ్మీర్‌పై తాలిబాన్ల వైఖరి ఏమిటి? అనే విషయాలపై Tv9 భారత్ వర్ష్‌ ప్రతినిధి దినేష్ గౌతమ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాలిబాన్ ప్రతినిధి సుహీల్ షాహీన్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో కొన్ని అతి కీలకమైన అంశాలు చూద్దాం.

ప్రశ్న. పాకిస్తాన్ మిమ్మల్ని భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకుందా?

సమాధానం: మాకు భారతదేశం గురించి మంచి అభిప్రాయం ఉంది. సమీప భవిష్యత్తులో కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పట్ల భారతదేశం మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ భూమిని ఏ దేశానికీ వ్యతిరేకంగా ఉపయోగించరాదనేది మా స్టాండ్.

ప్ర: ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా మంది భారతీయులు ఉన్నారు. వారి భద్రతకు మీరు ఎలాంటి హామీ ఇస్తారు?

స: పాస్‌పోర్ట్‌లు, వీసాలు, ఇతర ముఖ్యమైన పత్రాలు ఉన్నవారికి ఏమీ సమస్య ఉండదు. వేల సంఖ్యలో అందరూ ఒకే సారి ఎగబడుతుండటంతో వారి రికార్డులను తనిఖీ చేయడమనేది ప్రస్తుత పరిస్థితుల్లో కష్టతరంగా మారింది. సరైన పేపర్స్ ఉన్నవారు కాస్త నెమ్మదించండి. వాణిజ్య విమానాల ద్వారా వెళ్లాలనుకున్నవారంతా ఎప్పుడైనా తమ దేశాలకు వెళ్లవచ్చు. ఒకే సారి ప్రజలంతా ఎయిర్ పోర్టుకు వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడే అవకాశం ఉంది.

ప్ర: పాకిస్తాన్ సహకారానికి ప్రత్యుపకారంగా కాశ్మీర్‌ను వారికి అప్పగించాలనేదానికి మీరు అనుకూలమన్న చర్చ నడుస్తోంది.. దానిపై స్పందన ఏమిటి?

స: అవన్నీ కేవలం అపోహలే.. మా ఆఫ్ఘనిస్తాన్‌ను మరొక దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి మేము ఎట్టిపరిస్థితుల్లో అనుమతించం. పరిపాలన పూర్తి స్థాయిలో మాచేతికొచ్చిన తర్వాత ఆప్ఘన్ ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాం. అదే మా ప్రాధాన్యత కూడా.

ప్ర: మసూద్ అజార్ భారతదేశంలోని అనేక తీవ్రవాద చర్యలలో ప్రధాన నిందితుడు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అతను తాలిబాన్ నాయకుడు ముల్లా బరదార్‌తో సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి మీరేమంటారు?

స: మీరు ఏమి అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. అలాంటిదేమీ మా దృష్టికి రాలేదు. మాపై అభిశంసన జరుగుతోంది. ప్రజలను గందరగోళపరిచే ఉద్దేశ్యంతో కొందరు ఇలాంటి చర్యలు చేపట్టారు.

ప్ర: కాశ్మీర్‌పై మీ వైఖరి ఏమిటి?

స: ఆఫ్ఘనిస్తాన్ దేశం మరొకరికి వ్యతిరేకంగా ఉపయోగించబడదు. ఈ విషయాన్ని నేను పునరుద్ఘాటిస్తున్నా. ప్రపంచంలో ముస్లింలు ఎక్కడ ఉన్నా, వారికి సమాన హక్కులు ఉండాలనేది మేము నొక్కిచెప్పాము. ఆఫ్ఘనిస్తాన్‌లోని మైనారిటీల విషయంలో కూడా మా స్టాండ్ అదే.

ప్ర: ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితిని మీరు ఎలా అధిగమిస్తున్నారు?

స: పరిస్థితి రోజురోజుకు మెరుగుపడుతోంది. ఇప్పుడు కాబూల్‌లో శాంతి నెలకొంది. విమానాశ్రయంలో జరిగిన విషాదానికి చింతిస్తున్నాము. మా సహచరులు చాలా మంది అమరవీరులు అయ్యారు. కానీ ఈ సంఘటన జరిగిన ప్రదేశం యొక్క భద్రత అమెరికాకు చెందినది.

ప్ర: ISIS-K గురించి చాలా చర్చ జరిగింది. భారతదేశ దృష్టిలో ఇది అత్యంత ప్రమాదకరమైన సంస్థ. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

స: ఈ అంశంపై మా వైఖరి ఏమిటో గతంలో అనేకసార్లు స్పష్టం చేశాం. ఇది ఏ దేశానికీ వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ మైదానాన్ని ఉపయోగించడానికి అనుమతించం.

Read Also: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!

500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?