9/11 దాడుల్లో ఒసామా బిన్ లాడెన్ ప్రమేయం లేదంటున్న తాలిబన్లు.. అది అమెరికా పనేనని ఆరోపణ

అమెరికాలో 2001 సెప్టెంబరు 11 న జరిగిన దాడుల్లో ఆల్-ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ ప్రమేయం లేదని తాలిబన్లు అంటున్నారు. ఆఫ్ఘానిస్తాన్ పై యుద్దానికి అమెరికా ఈ దాడులను వినియోగించుకున్నదని అమెరికాపైనే ఆరోపణ చేశారు.

9/11 దాడుల్లో ఒసామా బిన్ లాడెన్ ప్రమేయం లేదంటున్న తాలిబన్లు.. అది అమెరికా పనేనని ఆరోపణ
No Proof Of Laden Role In 2001 Sep. 11 Attacks In Us Says Talibans
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 26, 2021 | 6:28 PM

అమెరికాలో 2001 సెప్టెంబరు 11 న జరిగిన దాడుల్లో ఆల్-ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ ప్రమేయం లేదని తాలిబన్లు అంటున్నారు. ఆఫ్ఘానిస్తాన్ పై యుద్దానికి అమెరికా ఈ దాడులను వినియోగించుకున్నదని అమెరికాపైనే ఆరోపణ చేశారు. లాడెన్ ప్రమేయం ఉందనడానికి ఆధారాలు ఏమిటని తాలిబన్ అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ ప్రశ్నించాడు. 20 ఏళ్ళ వార్ తరువాత కూడా 9/11 దాడుల్లో లాడెన్ పాత్ర ఉందనడానికి ఆధారాలు లేవని అన్నాడు. ఈ వార్ లో ఔచిత్యమే లేదని..యుధం కోసం అమెరికా ఈ దాడులను ఓ సాకుగా వాడుకున్నదని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. అల్-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు తిరిగి ఈ విధమైన హింసకు పాల్పడబోవని హామీ ఇవ్వగలుగుతారా అని ప్రశ్నించగా.. ఆఫ్ఘన్ గడ్డను టెర్రరిస్టు చర్యలకు వినియోగించుకోబోమని ఎన్నో సార్లు హామీ ఇచ్చామని ఆయన చెప్పాడు. అమెరికన్లకు లాడెన్ ఓ సమస్యగా మారినప్పుడు ఆయన ఆఫ్ఘానిస్తాన్ లో ఉన్నాడని.. దాడుల్లో ఆయన పాత్ర ఉందని ఎలా చెప్పగలుతామని జబీబుల్లా ముజాహిద్ పేర్కొన్నాడు. ఎవరినీ టార్గెట్ చేయడానికి మేము ఈ (ఆఫ్ఘన్) గడ్డను వినియోగించుకోవడం లేదని చెప్పాడు.

అయితే ఆల్-ఖైదా, జైషే మహ్మద్ వంటి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు తాలిబాన్లకు అండగా ఉన్నాయని ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు వస్తున్నాయి. పాక్ లోని అల్-ఖైదా స్థావరాల్లో తాలిబన్లు శిక్షణ పొందారని ఆఫ్ఘన్ పాప్ స్టార్ ఆర్యానా సయీద్ ఇటీవల బహిరంగంగానే ఆరోపించింది. తాలిబాన్లకు పాక్ మద్దతునిస్తోందనడానికి చాలా ఆధారాలున్నాయని ఆమె పేర్కొంది. అటు-నాడు లాడెన్ ని తమకు అప్పగించాలని అమెరికా కోరినప్పుడు తాలిబన్లు నిరాకరించిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ కారణం వల్లే అమెరికా వారిపై యుద్దానికి దిగింది. తాలిబన్లను-,అల్-ఖైదాను వేరుగా చూడజాలమని ఎనలిస్టులు నాడే ఓ అంచనాకు వచ్చారు. అంటే ఒక విధంగా ఆఫ్ఘన్ లో మళ్ళీ అల్-ఖైదా పడగ విప్పే సూచనలున్నాయని అంటున్నారు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆఫ్ఘన్ నుంచి ఉగ్రవాద శక్తుల ప్రభావం పొరుగు దేశాలపై పడరాదని వ్యాఖ్యానించారు. ఇది పరోక్షంగా ఇండియాను ఉద్దేశించే ఆయన ఈ మాటలన్నట్టు తెలుస్తోంది.

ఇలా ఉండగా తమకు మహిళంటే చాలా గౌరవమని, తమను చూసి వారెందుకు భయపడాలని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ సన్నాయి నొక్కులు నొక్కాడు. నిజానికి వాళ్ళు తమను చూసి గర్వపడాలన్నాడు. ఆఫ్ఘన్లు ఈ దేశాన్ని వదిలివెళ్లరాదని, వారిని తాము క్షమించేశామని పేర్కొన్నాడు. వారి అవసరం ఈ దేశానికి ఎంతయినా ఉందన్నాడు. మా దేశ ప్రజలు మాకు కావాలి.. యువత, విద్యావంతులు మాకు అవసరమే అని ఆయన పేర్కొన్నాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: తాలిబన్లు శవాలను కూడా రేప్ చేస్తారు… సంచలన విషయాలు తెలిపిన అఫ్ఘన్‌ మహిళ..:Taliban Rape Corpses Video.

ఈ స్కూటర్‌ ఒక్కసారి చార్జ్‌ చేస్తే 130 కి.మీ. వరకు మీ ఇష్టం..యూ గో ఎలక్ట్రికల్ స్కూటర్ :U-GO Electrical Scooter video.

సమంత, విజయ్ సేతుపతి, నయన తార ఒకే ఫ్రేమ్ లో ఫుట్ బోర్డు ప్రయాణం.. వైరల్ వీడియో..:Stars Viral Video.

ఆగిపోయే పెళ్లిని నెటిజన్స్‌ అండతో పేదింటి అమ్మాయికి ఘనంగా పెళ్లి..:Netizes‌ Support For Poor Girl Video.