ఆఫ్ఘన్ నుంచి భారతీయుల తరలింపునకు అత్యంత ప్రాధాన్యం.. అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం
ఆఫ్ఘానిస్తాన్ లో పరిస్థితి దారుణంగా ఉందని, అక్కడి నుంచి భారతీయులందరి తరలింపునకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఆఫ్ఘన్ లోని తాజా పరిస్థితిపై గురువారం ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమేవేశంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వివరించారు.
ఆఫ్ఘానిస్తాన్ లో పరిస్థితి దారుణంగా ఉందని, అక్కడి నుంచి భారతీయులందరి తరలింపునకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఆఫ్ఘన్ లోని తాజా పరిస్థితిపై గురువారం ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమేవేశంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వివరించారు. సాధ్యమైనంత ఎక్కువమంది భారతీయులను తరలించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. చాలామందిని ఇప్పటికే తరలించామని..నిన్న విమానంలో కొంతమంది ఇండియన్స్ రాలేకపోయారని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ.. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ తోను, రష్యా అధ్యక్షుడు పుతిన్ తోను చర్చించారని, రానున్న రోజుల్లో మరిన్ని చర్చలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. అతి క్లిష్టమైన పరిస్థితుల్లో తరలింపు ప్రక్రియను చేపట్టామన్నారు. ముఖ్యంగా కాబూల్ విమానాశ్రయంలో పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. కాగా ఆఫ్ఘన్ లో ఇంకా 15 వేలమంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. గురువారం జరిగిన సమావేశంలో మంత్రులు పీయూష్ గోయెల్, ప్రహ్లాద్ జోషీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, మల్లికార్జున్ ఖర్గే, డీఎంకే నేత టీ.ఆర్. బాలు, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ, అప్నా దళ్ నేత అనుప్రియ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఇలా ఉండగా దోహాలో గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో కుదుర్చుకున్న ఒప్పందం సందర్భంగా తాలిబన్ నేతలు ఇచ్చిన హామీలను ఇప్పుడు తుంగలో తొక్కారని ప్రభుత్వం అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. కాబూల్ లో ఏర్పడే ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం, ప్రజాస్వామ్య పరిరక్షణ, మతపరమైన స్వేచ్ఛ తదితరాలకు కట్టుబడి ఉంటామని నాడు వారు హామీ ఇచ్చారు. అయితే వీటిలో ఏ ఒక్కదానికి కూడా వారు కట్టుబడి లేరన్న ఆరోపణలు వస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: తాలిబన్లు శవాలను కూడా రేప్ చేస్తారు… సంచలన విషయాలు తెలిపిన అఫ్ఘన్ మహిళ..:Taliban Rape Corpses Video.
సమంత, విజయ్ సేతుపతి, నయన తార ఒకే ఫ్రేమ్ లో ఫుట్ బోర్డు ప్రయాణం.. వైరల్ వీడియో..:Stars Viral Video.