Afghanistan Deadliest Earthquake: తూర్పు అప్ఘనిస్తాన్‌లో బుధవారం తెల్లవారుజామున భయంకర భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ రోజు ఉదయం (జూన్ 23) 7 గంటల 18 నిముషాలకు మళ్లీ మరో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.3గా చూపింది. అఫ్ఘన్‌లోని ఫైజాబాద్‌కు నైరుతి భాగంలో 76 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. వరుసగా రెండో రోజుకూడా భూకంపం సంభవించడంతో అఫ్ఘన్ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
బుధవారం నాటి భూకంపంలో 1000కి పైగా మృతి చెందగా, 1500లకు పైగా ప్రజలు గాయపడ్డారు. భూకంప తీవ్రతకు అనేక ఇల్లు, సెల్‌ఫోన్ టవర్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. శిధిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. వేల మంది అఫ్ఘన్ ప్రజలు నిరాశ్రయులయ్యారు. తూర్పు అప్ఘన్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఖోస్ట్ నగరానికి 46 కి.మీ. దూరంలో, రాజధాని కాబూల్‌కు దక్షిణంగా 150 కి.మీ.దూరాన ఉన్న కొండ ప్రాంతం కేంద్రంగా భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీసీ) వెల్లడించింది. పాకిస్తాన్, ఇరాన్, భారత్‌ల్లోనూ 500 కిలోమీటర్ల మేర భూ ప్రకంపనలు సంభవించాయని, దీని తీవ్రతకు దాదాపు 119 మిలియన్ల ప్రజలు ప్రభావితమయ్యినట్లు యూరోపియన్ సిస్మలాజికల్ ఏజెన్సీ తెలిపింది. రెండు దశాబ్దాల తర్వాత ఇంత పెద్ద భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. పొరుగు దేశాలు, ఇతర సంస్థలు అఫ్ఘన్ భూకంప బాధితులకు ఆహారం సరఫరా, వైద్య సేవలు, అత్యవసర సేవలు అందించడానికి ముందుకొచ్చాయి.
Earthquake of Magnitude:4.3, Occurred on 23-06-2022, 03:41:51 IST, Lat: 28.28 & Long: 83.81, Depth: 66 Km ,Location: 161km WNW of Kathmandu, Nepal for more information download the BhooKamp App https://t.co/AzRnQs156f pic.twitter.com/eASKWjRhCi
— National Center for Seismology (@NCS_Earthquake) June 23, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..