Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abdul Ghani Baradar: ఏళ్ల తరబడి అజ్ఞాతంలో ఉన్న ముజాహిద్‌ ప్రత్యక్షం.. కాందహార్‌లో తలదాచుకున్నాః ముల్లా బరాదర్‌

ఆఫ్ఘనిస్తాన్‌ డిప్యూటీ ప్రధానిగా ప్రకటించుకున్న ముల్లా బరాదర్‌ చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్నారు తాలిబన్లు. అంతర్గత కలహాలతో ముల్లాబరాదర్‌ను ప్రత్యర్ధి వర్గం చంపినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Abdul Ghani Baradar: ఏళ్ల తరబడి అజ్ఞాతంలో ఉన్న ముజాహిద్‌ ప్రత్యక్షం..  కాందహార్‌లో తలదాచుకున్నాః ముల్లా బరాదర్‌
Abdul Ghani Baradar
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 13, 2021 | 8:25 PM

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌ డిప్యూటీ ప్రధానిగా ప్రకటించుకున్న ముల్లా బరాదర్‌ చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్నారు తాలిబన్లు. అంతర్గత కలహాలతో ముల్లాబరాదర్‌ను ప్రత్యర్ధి వర్గం చంపినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కోవిడ్‌తో చనిపోయినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఆడియో సందేశాన్ని విడుదల చేశాడు ముల్లా బరాదర్‌. అమెరికా బలగాలు, అఫ్గానిస్థాన్‌ సైనికుల కళ్లుగప్పి తాను ఏళ్లపాటు కాబుల్‌లోనే ఉన్నానని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌(43) తెలిపారు. తాను కాందహార్‌లో ఉన్నానని తెలిపారు బరాదర్‌. త్వరలోనే ఆఫ్ఘన్‌ ప్రజల ముందుకు వస్తానని తెలిపారు.

ప్రధాని ముల్లా మహ్మద్‌ హసన్‌ అఖుండ్‌ వర్గానికి బరాదర్‌ వర్గానికి ఘర్షణలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. తనను కాదని అఖుండ్‌ను ప్రధానిగా ప్రకటించడంపై బరాదర్‌ ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు.గత నెల్లో తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించుకున్నాక మీడియా ముందుకు వచ్చారు. అప్పటి నుంచి విలేకర్ల సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తను అజ్ఞాతంలో ఉన్నప్పటి వివరాలను తాజాగా ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో ఆయన వెల్లడించారు. వాయవ్య పాకిస్థాన్‌లోని నౌషెరాలో ఉన్న హక్కానియా విద్యాలయంలో తాను చదువుకున్నట్లు చెప్పారు.

తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ను తానెప్పుడూ చూడలేదని ఆయన చెప్పారు. ఒమర్‌ వారసులైన షేక్‌ ముల్లా మన్సూర్, షేక్‌ హెబతుల్లాల నాయకత్వంలోనే పనిచేసినట్లు తెలిపారు.ఆఫ్ఘన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు తరువాత బరాదర్‌తో పాటు మరో కీలక నేత అన్నీస్‌ హక్కానీ జాడ తెలియడం లేదు. అధ్యక్ష భవనంలో జరిగిన ఘర్షణలో బరాదర్‌ చనిపోయినట్టు , హక్కానీ గాయపడినట్టు తమ దగ్గర కచ్చితమైన సమాచారం అందని నార్తర్న్‌ అలయెన్స్‌ ప్రకటించింది.

Read Also… Railway SECR Recruitment 2021: ఐటీఐ విద్యార్థులకు గుడ్ న్యూస్‌..! పరీక్ష లేకుండానే ఉద్యోగ అవకాశం..

NEET: నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం.. అన్నాడీఎంకే పూర్తి మద్దతు

JioBook: మరో సంచలనానికి తెరతీయనున్న జియో.. అదిరిపోయే ఫీచర్లతో.. తక్కువ ధరలోనే ల్యాప్‌టాప్‌..!