అమెరికాలో విమాన ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన, అరెస్ట్, మానసిక రోగిగా అనుమానం , మినియా పొలిస్ అధికారుల ఆరా

అమెరికాలో విమాన ప్రయాణికుడొకరు తోటి ప్రయాణికుల పట్ల, విమాన సిబ్బంది పట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించడంతో అతడిని ఆ తరువాత అరెస్టు చేశారు.

అమెరికాలో విమాన ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన,  అరెస్ట్, మానసిక రోగిగా అనుమానం , మినియా పొలిస్ అధికారుల ఆరా

అమెరికాలో విమాన ప్రయాణికుడొకరు తోటి ప్రయాణికుల పట్ల, విమాన సిబ్బంది పట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించడంతో అతడిని ఆ తరువాత అరెస్టు చేశారు. అతడిని 40 ఏళ్ళ మార్క్ ఆంథోనీ స్కెర్బో గా గుర్తించారు. జెట్ బ్లూ విమానం (915) న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తుండగా ఇతడుహఠాత్తుగా తన సీట్లోనుంచి లేచి వారిని బెదిరించడం ప్రారంభించాడు. వారిని హతమారుస్తానంటూ వీరంగం వేశాడు. విమాన సిబ్బందిని కూడా ఆంథోనీ వదలలేదని, వారిని కూడా చంపుతానంటూ హెచ్చరించాడని తెలిసింది. ఇతని గొడవతో ఈ విమానాన్ని మధ్యలో మినియాపొలిస్ విమానాశ్రయంలో దింపివేశారు. ఇతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అతడిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి వద్ద ఏదో ఆయుధం ఉందని, దాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పిన పోలీసులు ఆ ఆయుధం ఏమిటో వెల్లడించలేదు. ఇతనికి ఫెడరల్ ఏవియేషన్ అధికారులు 19 వేల డాలర్ల నుంచి 52 వేలడాలర్ల వరకు పెనాల్టీ విధించే సూచనలున్నాయి.

ఈ వ్యక్తి మాస్క్ ధరించడానికి నిరాకరిస్తున్నాడని, కత్తితో పొడుస్తానన్నట్టు ప్రయాణికులను బెదిరించాడని విమాన సిబ్బంది ఒకరు తన సెల్ ఫోన్ ద్వారా వారికి తెలియజేశాడు. బహుశా ఇతడు మానసిక రోగి అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆ మధ్య విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కూడా లేచి విమాన అత్యవసర డోర్ తీయబోయేసరికి అప్రమత్తులైన ప్రయాణికులు అతడిని పట్టుకున్న సంగతి తెలిసిందే. అతడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాగా ప్రయాణికుల భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యమిస్తామని విమాన సిబ్బంది చెబుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Covid-19 Vaccine: వ్యాక్సిన్ వేసుకున్న ఫొటో పంపండి.. 5 వేలు గెలుచుకోండి..! ( వీడియో )

MIG-21: పంజాబ్ రాష్ట్రంలో కూలిపోయిన విమానం తీవ్రంగా గాయపడిన పైలెట్… ( వీడియో )

 

Click on your DTH Provider to Add TV9 Telugu