పోలీసులు కారును ఆపారు.. లోపల చెక్‌చేయగా మాయ నాగరికతకు చెందిన వెలకట్టలేని వస్తువులు! ఖాకీల కళ్లు బైర్లు!!

|

Nov 17, 2022 | 6:13 PM

మాయ నాగరికత కాలం క్రీస్తు జననం తర్వాత 900 సంవత్సరాల BC నుండి 250 BC గా పరిగణించబడుతుంది. 90 శాతానికి పైగా వస్తువులు అసలైనవి, స్పానిక్ కాలానికి పూర్వం నాటివిగా పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పారు.

పోలీసులు కారును ఆపారు.. లోపల చెక్‌చేయగా మాయ నాగరికతకు చెందిన వెలకట్టలేని వస్తువులు! ఖాకీల కళ్లు బైర్లు!!
Maya Civilization
Follow us on

ఓ మహిళా ప్రయాణికురాలి కారును తనిఖీ చేసిన ఖాకీలకు కళ్లు బైర్లు కమ్మేసినంతపనైంది. ఆమె కారులో మాయా నాగరికత కాలం నాటి అమూల్యమైన, అరుదైన వస్తువులు తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అమూల్యమైన 166 కళాఖండాలను కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం కారులోంచి కళాఖండాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న మహిళ సహా మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఈ ఘటన గ్వాటెమాలాలో చోటు చేసుకుంది. నిందితులిద్దరూ అమెరికాలో నివసిస్తున్నట్టుగా పోలీసులు తేల్చారు. అయితే, ఈ కళాఖండాల మొత్తం ధరను వెల్లడించలేదు. 166 కళాఖండాలలో 90 శాతానికి పైగా వస్తువులు అసలైనవి, స్పానిక్ కాలానికి పూర్వం నాటివిగా పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇదే తరహా చర్యకు పాల్పడినందుకు గతంలో ఓ మహిళను అరెస్టు చేసినట్లు గ్వాటెమాలన్ పోలీసులు తెలిపారు. హిస్పానిక్ కాలానికి పూర్వం విలువైన వస్తువులను ఆమె నుంచి కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు మహిళను గ్వాటెమాల సిటీ విమానాశ్రయం నుంచి పట్టుకున్నారు. ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేస్తున్న సమయంలో కస్టమ్స్ అధికారులు మహిళ సంచిలో నుంచి మాయ నాగరికతకు సంబంధించిన రెండు రాళ్లను గుర్తించారు. ఆ సమయంలో, ఆంటిగ్వా మార్కెట్ నుండి ఈ రాళ్లను కొనుగోలు చేసినట్లు విచారణలో సదరు మహిళ చెప్పింది.

విమానాశ్రయంలో తనిఖీ చేస్తున్నప్పుడు మహిళ బ్యాగ్‌లో ఈ రాయిని గుర్తించారు. 49 ఏళ్ల మహిళపై జాతీయ వారసత్వం స్మగ్లింగ్ కింద కేసు నమోదైంది. ఆ తర్వాత మహిళ గ్వాటెమాలా విడిచి వెళ్లకూడదనే షరతుపై బెయిల్ మంజూరు చేసింది. కేవలం మూడు రోజుల తరువాత, ఆంటిగ్వాలోని నైరుతి ప్రాంతం నుండి మహిళను మళ్లీ అరెస్టు చేశారు. ఈ సారి ఆమెతో పాటు 62 ఏళ్ల వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మాయ నాగరికత కాలం క్రీస్తు జననం తర్వాత 900 సంవత్సరాల BC నుండి 250 BC గా పరిగణించబడుతుంది. మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్, ఎల్ సాల్వడార్ వంటి దేశాల్లో ఈ నాగరికత విస్తరించింది. ఈ దేశాలకు వెళ్లే ప్రయాణికులు మాయ నాగరికతకు సంబంధించిన విషయాలను అక్రమంగా తరలించకుండా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల్లోని వేలం కేంద్రాల్లో ఈ వస్తువులకు డిమాండ్ ఉండడంతో పాటు ధర కూడా ఎక్కువే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి