బాహ్య ప్యానల్ లేకలుండానే గాల్లోకి ఎగిరిన విమానం.. ఆ తర్వాత ??
అమెరికా వైమానిక రంగ దిగ్గజం బోయింగ్ ను కష్టాలు వీడటం లేదు. తాజాగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం బయటవైపు ప్యానల్ లేకుండానే ప్రయాణించింది. ఇది అదృష్టవశాత్తు సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు. 139 మంది ప్రయాణికులతో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆరెగాన్ బయల్దేరిన ఈ విమానం ల్యాండింగ్‌కు ముందు జరిగిన చెకింగ్‌లో బయటవైపు ఓ ప్యానల్ లేనట్లు గ్రహించారు.
అమెరికా వైమానిక రంగ దిగ్గజం బోయింగ్ ను కష్టాలు వీడటం లేదు. తాజాగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం బయటవైపు ప్యానల్ లేకుండానే ప్రయాణించింది. ఇది అదృష్టవశాత్తు సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు. 139 మంది ప్రయాణికులతో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆరెగాన్ బయల్దేరిన ఈ విమానం ల్యాండింగ్‌కు ముందు జరిగిన చెకింగ్‌లో బయటవైపు ఓ ప్యానల్ లేనట్లు గ్రహించారు. ఇది రెక్కలను విమానం బాడీకి అమర్చే ప్రదేశంలోనిదిగా గుర్తించారు. విమానం బయలుదేరిన మిడ్‌ఫోర్డ్ ఎయిర్‌పోర్టులో రన్‌వే, పరిసరాల్లో ప్యానల్ కోసం గాలించారు. కానీ, ఎక్కడా దొరకలేదు. ఈ విమానాన్ని 25 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ ఘటనపై అమెరికా వైమానిక రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేపట్టింది. బోయింగ్ అధికారికంగా స్పందించలేదు. ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ కారణాలను పరిశీలిస్తున్నామని పేర్కొంది. అవసరమైన రిపేర్లు నిర్వహించాక ఆ విమానాన్ని తిరిగి సర్వీసులోకి తీసుకొస్తామని తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యబాబోయ్.. అతని కిడ్నీలో రాళ్లు కాదు.. రాళ్లగుట్టే..
70 ఏళ్లుగా ‘ఐరన్ లంగ్స్’తో జీవించిన పోలియో రోగి మృతి
ఈ శునకాలు చాలా ప్రమాదకరం.. 23 జాతుల పెంపుడు కుక్కలపై కేంద్రం బ్యాన్ ??
మేకప్ సామగ్రి చోరీ చేస్తున్న కాలిఫోర్నియా గర్ల్స్ ముఠా
రోగిగా నటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.. లొసుగులను బయటపెట్టిన ఐఏఎస్ అధికారిణి