అయ్యబాబోయ్.. అతని కిడ్నీలో రాళ్లు కాదు.. రాళ్లగుట్టే..
సాధారణంగా కిడ్నీలో ఒకటి రెండు రాళ్లు ఉంటేనే ఆ బాధ భరించడం కష్టం. అలాంటిది ఓ వ్యక్తి కిడ్నీలో ఏకంగా 418 రాళ్లను గుర్తించారు డాక్టర్లు. అనంతరం అతనికి ఆపరేషన్ చేసి కిడ్నీలో రాళ్లను తొలగించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. కేవలం 27 శాతం మూత్రపిండాల పనితీరు మాత్రమే ఉన్న రోగి నుంచి 418 కిడ్నీ రాళ్లను హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో నిపుణులైన యూరాలజిస్టుల బృందం విజయవంతంగా తొలగించారు.
సాధారణంగా కిడ్నీలో ఒకటి రెండు రాళ్లు ఉంటేనే ఆ బాధ భరించడం కష్టం. అలాంటిది ఓ వ్యక్తి కిడ్నీలో ఏకంగా 418 రాళ్లను గుర్తించారు డాక్టర్లు. అనంతరం అతనికి ఆపరేషన్ చేసి కిడ్నీలో రాళ్లను తొలగించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. కేవలం 27 శాతం మూత్రపిండాల పనితీరు మాత్రమే ఉన్న రోగి నుంచి 418 కిడ్నీ రాళ్లను హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో నిపుణులైన యూరాలజిస్టుల బృందం విజయవంతంగా తొలగించారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్యులు మినిమల్లీ ఇన్వాసివ్ విధానం ద్వారా ఈ అద్భుతమైన ఘనతను సాధించారు. హైదరాబాద్ లోని ఓ 60 ఏళ్ల వృద్ధుడికి గతంలో ఎన్నడూ లేని విధంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడి మూత్రపిండాల పనితీరు తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో డాక్టర్ కె పూర్ణ చంద్రారెడ్డి, డాక్టర్ గోపాల్ ఆర్ తక్ మరియు డాక్టర్ దినేష్ ఎం నేతృత్వంలోని బృందం ఇన్వాసివ్ విధానం ద్వారా రెండు గంటలకు పైగా శ్రమపడి వ్యక్తి కిడ్నీనుంచి పెద్దమొత్తంలో రాళ్లను తొలగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
70 ఏళ్లుగా ‘ఐరన్ లంగ్స్’తో జీవించిన పోలియో రోగి మృతి
ఈ శునకాలు చాలా ప్రమాదకరం.. 23 జాతుల పెంపుడు కుక్కలపై కేంద్రం బ్యాన్ ??
మేకప్ సామగ్రి చోరీ చేస్తున్న కాలిఫోర్నియా గర్ల్స్ ముఠా
రోగిగా నటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.. లొసుగులను బయటపెట్టిన ఐఏఎస్ అధికారిణి
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

