Gaza: సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.

Gaza: సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.

Anil kumar poka

|

Updated on: Mar 19, 2024 | 12:05 PM

ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంతో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న గాజావాసులకు సముద్ర మార్గం ద్వారా మానవతా సాయం అందనుంది. దాదాపు 200 టన్నుల ఆహార సామగ్రితో సైప్రస్‌ నుంచి బయల్దేరిన నౌక శుక్రవారం గాజా తీరానికి చేరుకుంది. ఓడ నుంచి సామగ్రి దించివేత ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. చిన్న పడవల ద్వారా భూభాగానికి చేర్చి.. స్థానికులకు పంచి పెట్టనున్నారు.

ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంతో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న గాజావాసులకు సముద్ర మార్గం ద్వారా మానవతా సాయం అందనుంది. దాదాపు 200 టన్నుల ఆహార సామగ్రితో సైప్రస్‌ నుంచి బయల్దేరిన నౌక శుక్రవారం గాజా తీరానికి చేరుకుంది. ఓడ నుంచి సామగ్రి దించివేత ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. చిన్న పడవల ద్వారా భూభాగానికి చేర్చి.. స్థానికులకు పంచి పెట్టనున్నారు. ఆకలితో అలమటిస్తోన్న పాలస్తీనీయులకు సముద్ర మార్గంలో అందనున్న తొలి సాయం ఇదేనని ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. గాజాలో దాదాపు ఆరు లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారులు తీవ్ర పోషకాహారం లోపంతో బాధపడుతున్నారని పేర్కొంది. అమెరికా, జోర్డాన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలు ఆహార పొట్లాలను జారవిడుస్తున్నాయి. స్థానికంగా ఆహార సంక్షోభాన్ని నివారించాలంటే రోజుకు 500 ఫుడ్‌ ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. కానీ, జనవరిలో రోజుకు 150.. ఫిబ్రవరిలో 97 ట్రక్కులు మాత్రమే ప్రవేశించాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..