Pune: రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో.! వీడియో.

పూణెలో శనివారం సాయంత్రం అందరూ చూస్తుండగా దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన కొందరు దుండగులు అనంతరం అతని గొంతు కోసి దారుణంగా హత్యచేశారు. బాధితుడిని 34 ఏళ్ల ప్రాపర్టీ డీలర్ అవినాశ్ బాలు ధాన్వేగా గుర్తించారు. రెండు గ్యాంగుల మధ్య ముఠా శత్రుత్వంగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూణె-సోలాపూర్ జాతీయ రహదారిపై ఉన్న ఓ రెస్టారెంట్‌లో జరిగిందీ ఘటన.

Pune: రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో.! వీడియో.

|

Updated on: Mar 19, 2024 | 12:19 PM

పూణెలో శనివారం సాయంత్రం అందరూ చూస్తుండగా దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన కొందరు దుండగులు అనంతరం అతని గొంతు కోసి దారుణంగా హత్యచేశారు. బాధితుడిని 34 ఏళ్ల ప్రాపర్టీ డీలర్ అవినాశ్ బాలు ధాన్వేగా గుర్తించారు. రెండు గ్యాంగుల మధ్య ముఠా శత్రుత్వంగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూణె-సోలాపూర్ జాతీయ రహదారిపై ఉన్న ఓ రెస్టారెంట్‌లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధాన్వే, మరో ముగ్గురు వ్యక్తులు రెస్టారెంట్‌లోని టేబుళ్ల వద్ద కూర్చున్నారు. సమీపంలోని మరో టేబుల్ వద్ద ఇద్దరు పిల్లలతో కూడిన ఓ కుటుంబం భోజనం చేస్తోంది. ఇంతలో మరో ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా నడుచుకుంటూ రెస్టారెంట్‌లోకి వచ్చారు. వారిలో ఒకరి చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. అందులోనుంచి తుపాకులు తీసి ఫోన్‌లో మాట్లాడుతున్న ధాన్వే తలపై కాల్పులు జరిపారు. దీంతో భయపడిన ధాన్వే, మిగతా ముగ్గురు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఆ వెంటనే రెస్టారెంట్‌లోకి మరో ఆరుగురు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. గాయపడిన థాన్వే పరుగెడుతూ అక్కడే పడిపోయాడు. నేలపై పడిపోయిన ధాన్వేను పట్టుకొని కత్తులతో దాడిచేసి గొంతు కోసి హత్యచేశారు. టేబుల్ వద్ద భోజనం చేస్తున్న కుటుంబం ఈ ఘటనతో భయపడిపోయి పరుగులుపెట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితుల కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. రెండు గ్యాంగుల మధ్య ఉన్న శత్రుత్వమే ఈ ఘటనకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో