Japan: జపాన్‌లో లక్షల్లో ఇళ్లు ఖాళీ.. ఎందుకంటే ??

Japan: జపాన్‌లో లక్షల్లో ఇళ్లు ఖాళీ.. ఎందుకంటే ??

Phani CH

|

Updated on: May 11, 2024 | 1:06 PM

జపాన్ గురించి మాట్లాడుకునేది ఎక్కువ. అక్కడి వాస్తవ పరిస్థితుల గురించి తెలిసింది తక్కువగా ఉంటుంది. సాధారణంగా జపాన్ లో ప్లేస్ అన్నది తక్కువగా ఉంటుందని.. అక్కడి ఇళ్లు సైతం చాలా చిన్నవిగా ఉంటాయని చెబుతుంటారు. మరి.. అలాంటి జపాన్ లో ఇప్పుడు 90 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయని.. వాటిల్లో నివాసం ఉండేందుకు ఆ దేశంలో ప్రజలు లేరనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ దేశ జనాభా అంతకంతకూ తగ్గిపోవటమే తప్పించి.. పెరుగుతున్న దాఖలాలు లేవు.

జపాన్ గురించి మాట్లాడుకునేది ఎక్కువ. అక్కడి వాస్తవ పరిస్థితుల గురించి తెలిసింది తక్కువగా ఉంటుంది. సాధారణంగా జపాన్ లో ప్లేస్ అన్నది తక్కువగా ఉంటుందని.. అక్కడి ఇళ్లు సైతం చాలా చిన్నవిగా ఉంటాయని చెబుతుంటారు. మరి.. అలాంటి జపాన్ లో ఇప్పుడు 90 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయని.. వాటిల్లో నివాసం ఉండేందుకు ఆ దేశంలో ప్రజలు లేరనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ దేశ జనాభా అంతకంతకూ తగ్గిపోవటమే తప్పించి.. పెరుగుతున్న దాఖలాలు లేవు. ఇప్పుడు జపాన్ లో ఖాళీగా ఉన్న ఇళ్లను పంచితే.. న్యూయార్క్ జనాభా మొత్తానికి సరిపోతాయని చెబుతున్నారు. ఇన్ని ఇళ్లు ఎందుకు ఖాళీ ఉన్నాయి అంటే.. దీనికి సమాధానం అక్కడి జనాభా తగ్గిపోవటమే అంటున్నారు. ఖాళీగా ఉండే ఇళ్లను అక్కడ అకియాలుగా పిలుస్తుంటారు. జపాన్ లోని ప్రధాన నగరాలుగా పేరున్న టోక్యో.. క్యోటోల్లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందని చెబుతున్నారు. ఇప్పుడా దేశంలో జనాభా తగ్గిపోవటం ఒక ప్రధాన సమస్యగా మారింది. దేశంలో పెద్ద వయస్కులు పెరిగిపోవటం.. జననాల సంఖ్య తగ్గిపోవటంతో జనాభా నిష్పత్తిలో వ్యత్యాసం చాలా ఎక్కువైంది. ఖాళీగా ఉన్న ఇళ్లను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెజ్‌ శాండ్‌విచ్ ఆర్డరిస్తే నాన్‌ వెజ్ డెలివరీ.. 50 లక్షల పరిహారానికి డిమాండ్

కార్లలో క్యాన్సర్ కార‌క కెమిక‌ల్స్‌.. అధ్యయనంలో వెల్లడి

విడాకులపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో

Sreeleela: కోలీవుడ్ స్టార్ హీరోకు శ్రీలీల ఝలక్.. అసలు ఏం జరిగిందంటే ??

అలా బ్రేకప్ అయిందో లేదో.. ఇంకో బ్యూటీని పట్టేసిన హీరో..