వెజ్‌ శాండ్‌విచ్ ఆర్డరిస్తే నాన్‌ వెజ్ డెలివరీ.. 50 లక్షల పరిహారానికి డిమాండ్

వెజ్‌ శాండ్‌విచ్ ఆర్డరిస్తే నాన్‌ వెజ్ డెలివరీ.. 50 లక్షల పరిహారానికి డిమాండ్

Phani CH

|

Updated on: May 11, 2024 | 1:05 PM

ప్రస్తుత కాలంలో అంతా ఆన్‌లైన్‌మయమే. ఏది కావాలన్నా ఒక్క క్లిక్‌తో కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది, ఇతరులకు ఉపాధి దొరుకుతుంది. ఇంతవరకూ ఓకే.. కానీ కొన్ని ఫుడ్ డెలివరీ సంస్థలు చేసే పొరపాట్లు కస్టమర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ మహళ వెజ్‌ శాండ్‌విచ్‌ ఆర్డర్‌ చేస్తే, నాన్‌వెజ్ డెలివరీ చేశారు. దీంతో ఆ మహిళ రెస్టారెంట్‌పై పరిహారం కోరుతూ కేసు వేసింది.

ప్రస్తుత కాలంలో అంతా ఆన్‌లైన్‌మయమే. ఏది కావాలన్నా ఒక్క క్లిక్‌తో కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది, ఇతరులకు ఉపాధి దొరుకుతుంది. ఇంతవరకూ ఓకే.. కానీ కొన్ని ఫుడ్ డెలివరీ సంస్థలు చేసే పొరపాట్లు కస్టమర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ మహళ వెజ్‌ శాండ్‌విచ్‌ ఆర్డర్‌ చేస్తే, నాన్‌వెజ్ డెలివరీ చేశారు. దీంతో ఆ మహిళ రెస్టారెంట్‌పై పరిహారం కోరుతూ కేసు వేసింది. అహ్మదాబాద్‌కు చెందిన నిరాలీ అనే మహిళ మే 3న పనీర్ పిక్‌ అప్ మీల్స్ బై టెర్రా నుంచి పనీర్ టిక్కా శాండ్‌విచ్ ఆర్డర్ చేసింది. ఇంటికి ఫుడ్ డెలివరీ అయ్యాక రెండు ముక్కలు తిన్న ఆమెకు డౌట్ వచ్చింది. శాండ్‌విచ్ సాధారణం కంటే కాస్తంత గట్టిగా అనిపించడంతో పరిశీలించి చూడగా అది చికెన్ శాండ్‌విచ్ అని తేలింది. దీంతో, మండిపడ్డ మహిళ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ హెల్త్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో, ఆహార శాఖ ఆ రెస్టారెంట్‌కు రూ.5 వేల జరిమానా విధించింది. అయితే, విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టని మహిళ రెస్టారెంట్ నుంచి రూ.50 లక్షల పరిహారం కోరుతూ కేసు వేసేందుకు సిద్ధమైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కార్లలో క్యాన్సర్ కార‌క కెమిక‌ల్స్‌.. అధ్యయనంలో వెల్లడి

విడాకులపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో

Sreeleela: కోలీవుడ్ స్టార్ హీరోకు శ్రీలీల ఝలక్.. అసలు ఏం జరిగిందంటే ??

అలా బ్రేకప్ అయిందో లేదో.. ఇంకో బ్యూటీని పట్టేసిన హీరో..

గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ