West Nile Virus: దూసుకొస్తున్న మరో కొత్త వైరస్..!! దోమ కాటు ద్వారా మానవుల్లోకి వ్యాప్తి.. రష్యా హెచ్చరిక.. వీడియో
రష్యాలో ఇప్పుడు మరో ప్రమాదకర వైరస్ ఒకటి విజృంభిస్తోంది. టీకా కానీ, మందులు కానీ లేని ఆ వైరస్ పేరు ‘వెస్ట్ నైల్’. ఈ వ్యాధి వున్న దోమలు కుట్టడం ద్వారా ఇది మనుషులకు సోకుతుంది.
రష్యాలో ఇప్పుడు మరో ప్రమాదకర వైరస్ ఒకటి విజృంభిస్తోంది. టీకా కానీ, మందులు కానీ లేని ఆ వైరస్ పేరు ‘వెస్ట్ నైల్’. ఈ వ్యాధి వున్న దోమలు కుట్టడం ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. రష్యాలో వెలుగు చూస్తున్న వెస్ట్ నైల్ కేసుల్లో 80 శాతానికి పైగా నైరుతి ప్రాంతంలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో డబ్ల్యూఎన్‌వీపై రష్యా ఆగష్టు 30 న ఆందోళనకర ప్రకటన చేసింది. ఇది మరింత చెలరేగిపోయే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ వైరస్ దోమల ద్వారా తీవ్రంగా వ్యాప్తి చెందే అవకాశముందని పేర్కొంది. ఆఫ్రికాలో పురుడుపోసుకున్న ఈ వైరస్ తర్వాత యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా దేశాలకు వ్యాప్తిచెందింది.
మరిన్ని ఇక్కడ చూడండి: బెర్ముడా ట్రయాంగిల్ కన్నా డేంజర్.. ఈ ప్రదేశం వైపున వెళ్లిన విమానం ఇప్పటి వరకు తిరిగి రాలేదు.. వీడియో
Viral Video: 70ఏళ్ల క్రితం నిర్మించిన పాత ఇంటికి అత్యాధునిక హంగులు.. వీడియో