భారత్ పైకి మహిళా ఉగ్రవాదులను ఉసిగొల్పనున్న పాక్
ఆపరేషన్ సిందూర్ దెబ్బకు భారీ నష్టాన్ని మూటగట్టుకున్న పాక్ ఉగ్ర సంస్థ జైష్-ఏ-మహ్మద్ కొత్త ఎత్తుగడ వేసింది. ఉగ్రకార్యకలాపాల్లో తొలిసారిగా మహిళలను రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. ఐసీస్, హమాస్, ఎల్‌టీటీఈ సంస్థలు ఇప్పటికే మహిళలను ఆత్మాహుతి దాడులకు ఉపయోగించడం చూసాం. జైష్ మాత్రం మహిళలను ఉగ్ర కలాపాలకు దూరంగా ఉంచాయి.
కానీ జైష్ తాజాగా తన పంథాను మార్చుకుంది. మహిళలనూ రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. ఇందుకు జైష్ అధినేత మసూద్ అజర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మహిళా బృందం పేరు జమాత్ ఉల్ మోమినాత్. ఈ దళానికి జైష్-ఏ-మహ్మద్ అధినేత మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ నేతృత్వం వహిస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో భారత దళాలు.. ఈ సంస్థ ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడిలో సాదియా భర్త మరణించాడు. ఈ దళంలో ఇప్పటికే జైషే ఉగ్రవాదుల భార్యలను చేర్చుకున్నారు. వీరితో ఆత్మాహుతి దాడులు చేయించేందుకు శిక్షణ ఇస్తున్నారు. పేద మహిళలను జైషే సంస్థ ఈ బృందంలో చేర్చుకుంటోంది. బహావల్‌పూర్, కరాచీ కేంద్రాల్లో మహిళలను రిక్రూట్ చేసుకుంటోంది. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను దీని కోసం ఉపయోగించుకుంటోంది. భారత్‌లో కూడా జమాత్ ఉల్ మోమినత్ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఆన్‌లైన్ వేదికల ద్వారా జమ్మూకశ్మీర్, యూపీలో ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలను కూడా టార్గెట్ చేసింది. మతం పేరిట నగరాల్లోని విద్యావంతులైన మహిళలను ఉగ్రవాదం వైపు లాగేలా ప్రచారం మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ దాడుల్లో తమ కుటుంబంలోని పది మంది మరణించారని జైషే సంస్థ అధిపతి మసూద్ అజర్ గతంలో ప్రకటించాడు. తన సోదరి భర్త, మరో బంధువు, అతడి భార్య, మేనకోడలు, మరో ఐదుగురు చిన్నారులు మరణించినట్టు తెలిపారు. భారత్ 1994లో మసూద్ అజర్‌ను అరెస్టు చేసినా ఆ తరువాత ఎయిర్ ఇండియా ఐసీ 814 విమానం హైజాక్ లో అతన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AI వీడియోలపై నిషేధం !! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
బంగారం కొనేటప్పుడు ఈ 5 విషయాలు తెలుసుకోండి
గోల్డ్ లోన్ తీసుకున్నారా ?? ఇది మీ కోసమే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

