AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI వీడియోలపై నిషేధం !! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

AI వీడియోలపై నిషేధం !! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Phani CH
|

Updated on: Oct 11, 2025 | 4:04 PM

Share

ఎన్నికల ప్రచారంలో ఏఐ వీడియోలు, పోస్టర్లతో దుమ్మురేపుదాం అనుకుంటున్నారా? ఏఐతో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు రకరకాల కంటెంట్‌ సిద్దం చేసుకున్నారా? అలాంటి పప్పులేమీ ఉడకవంటోంది భారత ఎన్నికల సంఘం. అన్ని రకాల AI-జనరేటెడ్ వీడియోల వాడకంపై ECI కఠిన నిషేధాన్ని ప్రకటించింది.

ఈ నిర్ణయం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనే సంస్థలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఓటర్లను ప్రభావితం చేయడానికి, తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి AI-జనరేటెడ్ కంటెంట్‌ను ఉపయోగించడం మోడల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణిస్తామని ఎన్నికల కమిషన్ చెప్పింది. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తప్పుడు సమాచారాన్ని అరికట్టే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏ అభ్యర్థి కూడా తమ ప్రత్యర్థులపై ప్రచారం చేయడానికి AI వీడియోలను ఏ రూపంలోనూ ఉపయోగించకూడదని కమిషన్ పేర్కొంది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీల ప్రచారంలో కృత్రిమ మేధస్సు దుర్వినియోగాన్ని నిరోధించడం, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడటం ఈ నిషేధం లక్ష్యం అని EC తెలిపింది. AI లేదా సింథటిక్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు రాజకీయ పార్టీలు మోడల్ ప్రవర్తనా నియమావళిని పాటించాలని సూచించింది. సోషల్ మీడియాలో అభ్యర్థులు, పార్టీలు పంచుకునే అన్ని రకాల కంటెంట్ ఇప్పుడు ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తుంది. సమాచారాన్ని తారుమారు చేయడానికి, ఓటర్లను తప్పుదారి పట్టించడానికి AI సాధనాలను ఉపయోగించరాదని కమిషన్ క్లియర్ గా చెప్పింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారం కొనేటప్పుడు ఈ 5 విషయాలు తెలుసుకోండి

గోల్డ్ లోన్ తీసుకున్నారా ?? ఇది మీ కోసమే

కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కేబినెట్ ఆమోదం

చెరువు గట్టుపై భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు

Mukesh Ambani: దేశీయ కుబేరుడిగా మళ్లీ అంబానీ.. జాబితాలో ఆరుగురు తెలుగోళ్లు