మయన్మార్‌లో సైబర్ మాఫియా దారుణాలు.. బయటపడ్డ 400 మంది భారతీయ బాధితులు
మయన్మార్‌లోని సైబర్‌క్రైమ్ అడ్డాల నుంచి థాయిలాండ్‌కు పారిపోయిన వెయ్యి మందిలో వందలాదిమంది భారతీయులు కూడా ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో సైబర్ ముఠాల అడ్డాలను సైన్యంతో సోదాలు చేయించింది జుంటా ప్రభుత్వం. దీంతో మయన్మార్ నుంచి సరిహద్దు గుండా థాయిలాండ్‌లోకి వెయ్యిమందికిపైగా పారిపోయారు.
వీరంతా థాయిలాండ్‌లోని కరేన్ రాష్ట్రంలోకి ప్రవేశించారు. వీరిలో 400 మంది భారతీయులు, 150 మంది చైనీయులు, 30 మంది థాయిలాండ్ జాతీయులు ఉన్నారు. దీన్ని థాయిలాండ్ అధికారులు కూడా నిర్ధారించారు. మయన్మార్‌లో కేకే పార్క్ కాంపౌండ్ అడ్డాగా సైబర్ ముఠాలు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ కాంపౌండ్‌లో వేలాది మంది పని చేస్తున్నారు. వీరిలో కొందరిని ఉద్యోగం పేరిట రప్పించి ఆయుధాలు ధరించిన సిబ్బంది పర్యవేక్షణలో నిర్బంధంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. భారీ శాలరీ వచ్చే ఉద్యోగమంటూ ఎర వేసి చైనా సైబర్ నేరాల ముఠాలు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా యువతను తరలిస్తున్నాయి. గోల్డెన్ ట్రయాంగిల్‌గా పిలిచే మయన్మార్, లావోస్, థాయ్‌లాండ్, కంబోడియాలోని తమ స్థావరాలకు వారిని తీసుకెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నాయి. గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల్లో వెయ్యిమందికి పైగా భారతీయ యువకులు బందీలుగా ఉన్నట్టు సమాచారం. ఇక్కడ పనిచేస్తున్నవారిలో వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇథియోపియా, పాకిస్థాన్, ఇండోనేషియా, నేపాల్ జాతీయులు కూడా ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో మయన్మార్-థాయిలాండ్ సరిహద్దు వెంబడి సైబర్ అడ్డాలపై దాడులు చేసి కాపాడిన 549 మందిని భారత్ రెండు మిలిటరీ విమానాల్లో తీసుకువచ్చింది. మార్చిలో మయన్మార్‌లో సైబర్ నేరాలకు పాల్పడే చైనా ముఠాల వద్ద బందీలుగా చిక్కుకున్న 162 మంది భారతీయుల్ని రక్షించారు. భారత అధికారుల ఒత్తిడితో స్పందించిన మయన్మార్ అధికారులు వారిని విడిపించారు. మయన్మార్ అధికారులు రక్షించిన వారిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు 18 మంది ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనా సముద్రంలో కూలిన అమెరికా విమానం
ISRO: మరో అతిపెద్ద రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్దం
Jupiter: భూమిని రక్షించిన బృహస్పతి.. లేకుంటే
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

