AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: మరో అతిపెద్ద రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్దం

ISRO: మరో అతిపెద్ద రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్దం

Phani CH
|

Updated on: Oct 28, 2025 | 5:46 PM

Share

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో మరో ప్రతిష్టాత్మక భారీ బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 నవంబర్ 2 న LVM3 -M5 అనే బాహుబలి రాకెట్ ప్రయోగం ద్వారా CMS 03 అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని రెండవ రాకెట్ లాంచ్ ప్యాడ్ నందు రాకెట్‌ను ప్రయోగించేందుకు..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో మరో ప్రతిష్టాత్మక భారీ బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 నవంబర్ 2 న LVM3 -M5 అనే బాహుబలి రాకెట్ ప్రయోగం ద్వారా CMS 03 అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని రెండవ రాకెట్ లాంచ్ ప్యాడ్ నందు రాకెట్‌ను ప్రయోగించేందుకు.. ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోటలోని వెహికిల్ ఆసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధాన పనులను పూర్తిచేసి వాహక నౌకను లాంచ్ ప్యాడ్ కు విజయవంతంగా తరలించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష ప్రయోగాల పరంపరలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రాకెట్ ప్రయోగాల విజయ పరంపరతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు నవంబర్ 2న మరో భారీ బహుబలి రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. అందులో భాగంగానే నవంబర్ 2 సాయంత్రం తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలోని రెండవ లాంచ్ పాడ్ ఈ రాకెట్ ప్రయోగానికి వేదిక కాబోతుంది. 4400 కేజీలు బరువు కలిగిన అతి భారీ బరువు కలిగిన GSAT..7R అనే ఉపగ్రహాన్ని, భూమి నుంచి 36000 వేల కిలోమీటర్ల ఎత్తున ఉన్న GTO ORBIT భూ బదిలీ కక్ష లోకి ఈ భారీ ఉపగ్రహాన్ని పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు పూర్తిచేశారు. వాతావరణం కనుక అనుకూలిస్తే శాస్త్రవేత్తలు అనుకున్న ప్రకారం నవంబర్ 2న ఈ భారీ బహుబలి రాకెట్ ప్రయోగాన్ని పూర్తి చేయనున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు షార్ నుండి ఇంత బరువైన ఉపగ్రహాన్ని పంపడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతం అయితే ఇస్రో మరో మైలురాయి అధిగమించనుంది. ఈ ఉపగ్రహం ద్వారా భారత దేశంలోని భూబాగంతో సహా మారుమూల ప్రాంతాలైన అటవీ ప్రాంతాలు, సముద్ర ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ GSAT..7R ఉపగ్రహం ఉపయోగపడుతుంది. 2013 లో ప్రయోగించిన GASAT..7 ఉపగ్రహం కాల పరిమితి ముగియడంతో తిరిగి కొత్త ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో GSAT..7R పేరుతో రూపొందించారు. ఈ ఉపగ్రహాన్ని భూమి నుండి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష జీ టి ఓ ఆర్బిట్లోకి ఈ శాటిలైట్‌ను శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. ఈ GAST..7R ప్రయోగించిన రోజు నుండి మరో పది సంవత్సరముల కాలం పాటు భారతదేశానికి మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందించే విధంగా ఈ జి సాట్ సెవెన్ ఆర్ ఉపయోగపడుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jupiter: భూమిని రక్షించిన బృహస్పతి.. లేకుంటే

గంటకు 85 కి.మీ వేగంతో కదులుతున్న మొంథా

మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌.. విశాఖలో కూలిన భారీ వృక్షం

ఓడలరేవు దగ్గర సముద్రం కల్లోలం.. ఎగసిపడుతున్న రాకాసి అలలు

కొన్ని విమర్శలు.. కొన్ని పొగడ్తలు షాకింగ్ లుక్‌లో హీరో